కడప దాటి ప్రతి గడపలోకి.. ఆసక్తిరేపుతున్న 'యాత్ర' ప్రీలుక్, టీజర్ సరిగ్గా అప్పుడే!
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా యాత్ర చిత్రం తెరకెక్కుతోంది. మలయాళీ మెగాస్టార్ మమ్ముట్టి వైఎస్ఆర్ పాత్రలో నటిస్తున్నాడు. మహి వి. రాఘవ్ ఈ చిత్రానికి దర్శకుడు. రాజశేఖర్ రెడ్డి రాజకీయ జీవితంలో కీలక అంశాలు ఈ చిత్రంలో చూపించబోతున్నారు.
తాజాగా ఈ చిత్ర ప్రీ లుక్ విడుదల చేశారు. జులై 8 న వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని సరిగ్గా తెల్లవారు జామున 12:01 గంటలకు టీజర్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కడప దాటి ప్రతి గడపలోకి వస్తున్నాను.. మీతో కలసి నడవాలనుంది.. మీ గుండె చప్పుడు కావాలని ఉంది.. అంటూ వైఎస్ పాదయత్రని ఉద్దేశించిన వ్యాఖ్యని ప్రీ లుక్ లో పేర్కొన్నారు.

రాజశేఖర్ రెడ్డి పేరు చెప్పగానే ప్రత్యేకమైన ఆయన పంచె కట్టు కళ్ళముందు మెదులుతుంది. పంచె కట్టు, బూట్లు ధరించి ఉన్న మమ్ముట్టి కాళ్ళని మాత్రం ప్రీ లుక్ లో చూపించారు.


Click it and Unblock the Notifications











