వైఎస్ఆర్ బయోపిక్ ‘యాత్ర’ విడుదల ఎప్పుడంటే?
మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'యాత్ర'. మహి.వి రాఘవ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో మలయాళ స్టార్ మమ్ముట్టి వైఎస్ఆర్ పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. జూన్ 20న చిత్రీకరణ మొదలవ్వగా సెప్టెంబర్లో పూర్తయ్యేలా సింగిల్ షెడ్యూల్ ప్లాన్ చేశారు.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. సినీమా రిలీజ్‌లకు అత్యంత కీలకమైన సమయం ఇది. ఈ సమయంలో అయితేనే ఈ బయోపిక్ ఎక్కువ మందికి రీచ్ అవుతుందని భావిస్తున్నారట.

ఇటీవల ఈ చిత్రానికి సంబంధించి టీజర్ విడుదల తర్వాత అంచనాలు మరింత పెరిగాయి. మమ్ముట్టిని చూస్తుంటే అచ్చం వైఎస్ఆర్‌ను చూసినట్లే ఉందని, ఆయన రూపం, నడక, బాడీ లాంగ్వేజ్ జన నేతను గుర్తు చేస్తున్నదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
వైఎస్ఆర్ ముఖ్యమంత్రి కావడానికి ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 60 రొజుల్లో 1500 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. ఈ పాద్రయాతను ప్రధానంగా ఫోకస్ చేస్తూ 'యాత్ర' సినిమా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమా రాబోయే 2019 ఎన్నికలపై ఎంతో కొంత ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











