twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వైఎస్ఆర్ దిగొచ్చినట్లే ఉంది: ‘యాత్ర’ టీజర్లో మమ్ముట్టి అదుర్స్

    By Bojja Kumar
    |

    ఉమ్మ‌డి ఆంధ్రప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి‌గా రాష్ట్ర‌రాజ‌కీయాల్ని తిర‌గ‌రాసిన డాక్ట‌ర్ వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి బ‌యోపిక్‌లొ మలయాళ సూప‌ర్‌స్టార్ మ‌మ్మూట్టి న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. మ‌హి వి రాఘ‌వ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. జూన్ 20న చిత్రీకరణ మొదలవ్వగా సెప్టెంబర్లో పూర్తయ్యేలా సింగిల్ షెడ్యూల్ ప్లాన్ చేశారు. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన మెద‌టి లుక్‌కు విశేషమైన స్పందన వచ్చింది.

    తాజాగా వైఎఎస్ జయంతి(జులై 08) సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదల చేశారు. టీజర్ విడుదల తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. మమ్ముట్టిని చూస్తుంటే అచ్చం వైఎస్ఆర్‌ను చూసినట్లే ఉందని, ఆయన రూపం, నడక, బాడీ లాంగ్వేజ్ జన నేతను గుర్తు చేస్తున్నదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

    తెలుసుకోవాలని ఉంది.. వినాలని ఉంది.. ఈ గడపదాటి ప్రతి గడపలోకి వెళ్లాలని ఉంది.. వారితో కలిసి నడవాలని ఉంది.. వాళ్ల గుండె చప్పుడు వినాలని ఉంది. గెలిస్తే పట్టుదల అంటారు. ఓడిపోతే మూర్ఖత్వం అంటారు. ఈ పాదయాత్ర నా మూర్ఖత్వమో.. పట్టుదలో? చరిత్రనే నిర్ణయించుకోవచ్చు.... అంటూ రాసిన డైలాగులు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.

    60 రొజుల్లో 1500 కిలోమీట‌ర్స్ కాలి న‌డ‌క‌తో క‌డ‌ప దాటి ప్ర‌తి ఇంటి గ‌డ‌ప లొకి వెళ్ళి పెద‌వాడి క‌ష్టాన్ని, అక్క‌చెల్లెళ్ళ భాద‌ల్ని, రైతుల ఆవేద‌న‌ని చూసి వారితో క‌ల‌సి న‌డిసి వారి గుండె చ‌ప్పుడుగా మారి వారి క‌ష్టాల్ని త‌న క‌ళ్ళ‌తో చూసి బ‌రువెక్కిన గుండెతో ప్ర‌జ‌ల హ్రుద‌యాల్లో స్థానం సంపాయించిన ఎకైన నాయ‌కుడు దివంగ‌త నేత డాక్ట‌ర్ వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి.. ఆయ‌న బ‌యెపిక్ ని ఆయ‌న ఇమేజ్ కి ఏమాత్రం త‌గ్గ‌కుండా చిత్రీక‌రిస్తున్నామని నిర్మాతలు విజ‌య్ చిల్లా, శశిదేవి రెడ్డి తెలిపారు.

     Yatra Movie Teaser

    English summary
    Yatra Movie Teaser Released. The movie ft. Mammootty as YSR / YS Rajasekhara Reddy. Directed by Mahi V Raghav and music by K. Produced by Vijay Chilla & Shashi Devireddy under 70MM Entertainments banner.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X