Don't Miss!
- Technology ధర రూ.9,999 కే 108MP కెమెరా, 8GB ర్యామ్ స్మార్ట్‌ఫోన్.. కొనుగోలుపై స్మార్ట్‌వాచ్ ఉచితం..!
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- News ప్రధాని మోదీ, రాహుల్ గాంధీలకు షాక్; కోడ్ ఉల్లంఘనలపై ఈసీ నోటీసులు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
వైఎస్ఆర్ దిగొచ్చినట్లే ఉంది: ‘యాత్ర’ టీజర్లో మమ్ముట్టి అదుర్స్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రాష్ట్రరాజకీయాల్ని తిరగరాసిన డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్లొ మలయాళ సూపర్‌స్టార్ మమ్మూట్టి నటిస్తున్న విషయం తెలిసిందే. మహి వి రాఘవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. జూన్ 20న చిత్రీకరణ మొదలవ్వగా సెప్టెంబర్‌లో పూర్తయ్యేలా సింగిల్ షెడ్యూల్ ప్లాన్ చేశారు. ఇప్పటికే విడుదల చేసిన మెదటి లుక్కు విశేషమైన స్పందన వచ్చింది.
తాజాగా వైఎఎస్ జయంతి(జులై 08) సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదల చేశారు. టీజర్ విడుదల తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. మమ్ముట్టిని చూస్తుంటే అచ్చం వైఎస్ఆర్ను చూసినట్లే ఉందని, ఆయన రూపం, నడక, బాడీ లాంగ్వేజ్ జన నేతను గుర్తు చేస్తున్నదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
తెలుసుకోవాలని ఉంది.. వినాలని ఉంది.. ఈ గడపదాటి ప్రతి గడపలోకి వెళ్లాలని ఉంది.. వారితో కలిసి నడవాలని ఉంది.. వాళ్ల గుండె చప్పుడు వినాలని ఉంది. గెలిస్తే పట్టుదల అంటారు. ఓడిపోతే మూర్ఖత్వం అంటారు. ఈ పాదయాత్ర నా మూర్ఖత్వమో.. పట్టుదలో? చరిత్రనే నిర్ణయించుకోవచ్చు.... అంటూ రాసిన డైలాగులు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.
60 రొజుల్లో 1500 కిలోమీటర్స్ కాలి నడకతో కడప దాటి ప్రతి ఇంటి గడప లొకి వెళ్ళి పెదవాడి కష్టాన్ని, అక్కచెల్లెళ్ళ భాదల్ని, రైతుల ఆవేదనని చూసి వారితో కలసి నడిసి వారి గుండె చప్పుడుగా మారి వారి కష్టాల్ని తన కళ్ళతో చూసి బరువెక్కిన గుండెతో ప్రజల హ్రుదయాల్లో స్థానం సంపాయించిన ఎకైన నాయకుడు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. ఆయన బయెపిక్ ని ఆయన ఇమేజ్ కి ఏమాత్రం తగ్గకుండా చిత్రీకరిస్తున్నామని నిర్మాతలు విజయ్ చిల్లా, శశిదేవి రెడ్డి తెలిపారు.