థియేటర్లో ‘వైఎస్ఆర్’.. అమేజాన్ ప్రైమ్‌లో ‘ఎన్టీఆర్’
వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా మహి వి రాఘవ్ దర్శకత్వంలో రూపొందిన 'యాత్ర' చిత్రం గ్రాండ్‌గా విడుదలైంది. ఇండియా వైడ్ ఈ మూవీ దాదాపు 1000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రి కావడానికి ముందు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించిన పాద్ర యాత్ర నేపథ్యంలో ఈ చిత్రం రూపొందించారు.
ప్రజలకు ఏదైనా మంచి చేయాలని వైఎస్ఆర్ తపించిన తీరు ఈ చిత్రంలో దర్శకుడు ఎంతో అద్భుతంగా చూపించారని, కొన్ని సీన్లలో భావోద్వేగాలు ప్రేక్షకులను మెస్మరైజ్ చేసే విధంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయిదే సమయంలో కొంత నెగిటివ్ ఫీడ్ బ్యాక్ కూడా వినిపిస్తోంది.

డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి పాదయాత్రలోని ముఖ్య ఘట్టాలతో నిర్మించిన 'యాత్ర'లో మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించారు. మహి వి రాఘవ్ దర్శకత్వంలో చిల్లా, శశి దేవిరెడ్డి 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ బేనర్లో నిర్మించారు.
మరో వైపు... ఇదే రోజు 'ఎన్టీఆర్-కథానాయకుడు' అమేజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. ఈ చిత్రం సంక్రాంతికి థియేటర్లలోకి రాగా నెల రోజులు తిరక్కముందే డిజిటల్ వెర్షన్ ఆన్‌లైన్ స్ట్రీమింగ్ అందుబాటులోకి వచ్చింది. బాలయ్య టైటిల్ రోల్ పోషించిన ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు అందినప్పటికీ.. బాక్సాఫీసు వద్ద వర్కౌ కాలేదు.
క్రిష్ దర్శకత్వంలో రూపొందిన 'ఎన్టీఆర్-కథానాయకుడు'లో ఎన్టీ రామారావు సినీ జీవితాన్ని చూపించారు. ఆయన సినిమా రంగంలోకి ఎలా వచ్చారు, ఈ రంగంలో అంచెలంచెలుగా నెం.1 స్టార్‌గా ఎదిగిన తీరును కళ్లకు కట్టినట్లు చూపించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులుగా పని చేసి... సంక్షేమ పథకాలతో ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్న ఇద్దరు మహానేతల బయోపిక్స్ ఒకే సమయంలో తెరకెక్కడం, దాదాపు ఒకే సమయంలో ప్రేక్షకుల ముందుకు రావడం విశేషం.


Click it and Unblock the Notifications











