నాని సినిమాలు చేయడం వేస్ట్.. ఆయనకు అదే బెటర్.. వారి వల్లే ఇలా అంటూ రోజా ఫైర్..

ఏపీ ప్రభుత్వానికి టాలీవుడ్ కు మధ్య టికెట్ రేట్ల విషయంలో కోల్డ్ వార్ జరుగుతున్న విషయం తెలిసిందే.. టికెట్ రేట్లు తగ్గించడం పై సినీ పెద్దలు బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేయకున్నా హీరో నాని, సిద్ధార్థ్ వంటి వారు బయటకు వచ్చి కామెంట్లు చేస్తున్నారు. అయితే నాని వ్యాఖ్యల మీద వైసీపీ నుంచి గట్టి కౌంటర్లు వస్తున్నాయి. తాజాగా ఆర్కే రోజా నాని మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే

కిరాణా దుకాణం కలెక్షన్లు ఎక్కువగా

కిరాణా దుకాణం కలెక్షన్లు ఎక్కువగా

ఏపీలో సినిమా టికెట్ల ధరల వ్యవహారంలో సినీ పరిశ్రమ వర్సెస్ వైసీపీ ప్రభుత్వం అన్నట్లు రోజు రోజుకీ పరిస్థితి మారిపోతోంది. టికెట్ల ధరల తగ్గింపు..థియేటర్ల మూసివేత వ్యవహారం పైన తాజాగా హీరో నాని చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి దారి తీసాయి. టికెట్ల ధరలు తగ్గించడం అంటే ప్రేక్షకులను అవమానించడమేనని చెబుతూ... సినిమా థియేటర్ల కలెక్షన్ల కంటే కిరాణా దుకాణం కలెక్షన్లు ఎక్కువగా ఉంటున్నాయని వ్యాఖ్యానించారు.

చిన్న సినిమాల గురించి ఆలోచించడం లేదని

చిన్న సినిమాల గురించి ఆలోచించడం లేదని

నాని చేసిన కామెంట్స్ మీద ఇప్పటికే మంత్రులు అనిల్..బొత్సా..పేర్ని నాని సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. దీంతో ప్రముఖ నిర్మాత దిల్ రాజు నాని వ్యాఖ్యల పై వివాదం చేయవద్దని సూచించారు. ఇప్పుడు హీరో నాని వ్యాఖ్యలపై సినీ నటి వైసీపీ ఫైర్ బ్రాండ్ నగరి ఎమ్మెల్యే రోజా స్పందించారు. సీఎం జగన్ ఏం చేసినా పేదలకు మంచి జరిగేలానే చూస్తారు అని నటి, వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. పెద్ద సినిమాల గురించి ఆలోచిస్తున్నారే కానీ చిన్న సినిమాల గురించి ఆలోచించడం లేదని ఆమె అన్నారు.

సినిమాలు చేయడం వేస్ట్

సినిమాలు చేయడం వేస్ట్

ప్రభుత్వం నిర్ణయించిన కమిటీ అన్ని విషయాలు పరిష్కరిస్తుందన్న ఆమె నాని సినిమా థియేటర్ల కంటే కిరాణా కొట్టు వ్యాపారం బాగా ఉన్నప్పుడు ఆయన సినిమాలు చేయడం వేస్ట్.. కిరాణా వ్యాపారమే చేసుకోవచ్చన్నారు. ఇలాంటి వాఖ్యలు రెచ్చగొట్టడమే అవుతుందని రోజా మండిపడ్డారు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల సినిమా పరిశ్రమ మరింత నష్టపోయే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు.

పార్టీలు పెట్టిన వారి వల్లే ఇలా

పార్టీలు పెట్టిన వారి వల్లే ఇలా

రాజకీయ ఉనికిని చాటుకునేందుకు, పార్టీలు పెట్టిన వారి వల్లే ఇలాంటి వివాదాలు వస్తున్నాయని ఆమె అన్నారు. అలాగే కొద్దిమంది నోటి దురద వల్ల మా ఎన్నికలు జనరల్ ఎలక్షన్ ను తలపించాయి అని పేర్కొన్న ఆమె పొలిటికల్ పార్టీ పెట్టి సినిమాలు తీస్తున్న వ్యక్తి వల్లే ఇదంతా జరుగుతుందని సినిమా ఇండస్ట్రీలో ఎవరికి తోచినట్టు వారు మాట్లాడటం వల్లే ఇదంతా జరుగుతోందని రోజా ఫైర్ అయ్యారు.

ఎవరికి తోచిన విధంగా వారు

ఎవరికి తోచిన విధంగా వారు

గతంలో లేని విధంగా సినీ ఇండస్ట్రీలో ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడుతుండటం కారణంగా ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయని రోజా చెప్పుకొచ్చారు. ప్రభుత్వం ఎప్పుడూ చర్చలకు సిద్ధమేనని మంచి ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు వస్తే అన్నీ సమస్యలు పరిష్కారం అవుతాయని రోజా సూచించారు. మరి రోజా చేసిన కామెంట్స్ ఎవరిని ఉద్దేశించి చేసినవి అనే దాని మీద క్లారిటీ లేదు. ఇక ఆమె కామెంట్స్ మీద నాని ఎలా స్పందిస్తారు? నేడో తెలియాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X