సాయి ధరమ్ తేజ్‌పై వైసీపీ లీడర్ అనుచిత వ్యాఖ్యలు.. వైఎస్ జగన్ 3.63 కోట్ల ఎగ్ పఫ్‌పై మెగా మేనల్లుడు కౌంటర్
తెలుగు చిత్ర పరిశ్రమలోకి మెగా కాంపౌండ్ నుంచి వచ్చినా.. తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకుని స్టార్‌గా మారిపోయాడు టాలెంటెడ్ హీరో సాయి ధరమ్ తేజ్. అన్ని విభాగాల్లోనూ రాణిస్తూ సత్తా చాటుతోన్న అతడు.. 'విరూపాక్ష' మూవీతో వంద కోట్లు కొల్లగొట్టాడు. ఈ ఉత్సాహంలోనే మరిన్ని ప్రాజెక్టులు చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ అంశంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సపోర్టర్‌తో సాయి ధరమ్ తేజ్ ఫైటింగ్‌కు దిగాడు. ఇంతకీ వీళ్ల మధ్య ఏం జరిగింది? అతడికి మెగా మేనల్లుడు ఎలాంటి కౌంటర్ ఇచ్చాడు? అనేవి మీరే చూసేయండి!
వైసీపీ అన్నా క్యాంటీన్ ప్రచారం
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వం ఆగస్టు 15వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసి రూ. 5కే భోజనం పెడుతోంది. ఈ నేపథ్యంలో తణుకు పట్టణంలోని ఓ క్యాంటీన్‌లోని సిబ్బంది శుభ్రం లేని నీటిలో ప్లేట్లు కడుగుతున్నారని వీడియో తీసి.. దాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వైరల్ చేస్తున్నారు.

సాయి ధరమ్ తేజ్‌ను లాగుతూ
అన్నా క్యాంటీన్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతుండగా ఓ వైసీపీ సపోర్టర్.. సాయి ధరమ్ తేజ్‌ను ఈ వివాదంలోకి లాగాడు. గతంలో కూటమి గెలిచినప్పుడు 'ఏపీ సేఫ్ హ్యాండ్స్‌లోకి వచ్చింది' అని మెగా హీరో ట్వీట్ చేయడాన్ని గుర్తు చేస్తూ సదరు ఎన్నారై 'మెడలు రుద్దే సేఫ్ హ్యాండ్స్ ఎక్కడ ఉన్నాయి? మీ సేఫ్ హ్యాండ్స్‌తో అన్న క్యాంటీన్లలో ప్లేట్లు కడగొచ్చు కదా' అని ట్వీట్ చేశాడు.

మీరు ఎక్కడ? బయోలో ఉంది
ఎన్నారై అయిన సదరు వైసీపీ సపోర్టర్ చేసిన ట్వీట్‌కు సాయి ధరమ్ తేజ్ స్పందిస్తూ 'డాక్టర్ గారు మీరు ఎక్కడ ఉంటారు' అని అడిగాడు. దీనికాయన 'నా బయోలో ఉంది చూడు' అని చెప్పాడు. అందులో సదరు ఎన్నారై 'కడప జిల్లాకు చెందిన వ్యక్తి అని.. యూకే వైసీపీ కన్వీనర్' అని రాసి ఉంది. దీంతో సాయి ధరమ్ తేజ్‌కు అసలు మేటర్ అర్థం అయిపోయింది.
ఎగ్ పఫ్‌ల బిల్. జాగ్రత్త సార్
ఏపీలో ఎగ్ పఫ్‌లకు జగన్ ప్రభుత్వం రూ. 3.63 కోట్లు ఖర్చు చేయడం సంచలనం అయిన విషయం తెలిసిందే. దీన్ని ప్రస్తావిస్తూ సాయి ధరమ్ తేజ్ 'ఎగ్ పఫ్స్‌కు సంబంధించిన బిల్లులు అంత ఎక్కువగా ఉండటంలో ఏమీ ఆశ్చర్యంగా అనిపించడం లేదు. నాకు తెలిసి మీరు కూడా ఆ పఫ్ తిని ఉంటారు. జాగ్రత్తగా ఉండండి సర్' అని ఆ వైసీపీ సపోర్టర్‌కు కౌంటర్ ఇచ్చాడు.
హీరోయిన్లతో అలాంటి సీన్స్
సాయి ధరమ్ తేజ్ చేసిన ట్వీట్‌తో సదరు వైసీపీ సపోర్టర్ మరింతగా రెచ్చిపోయాడు. అంతేకాదు, ఓ హీరోయిన్ వికీపీడియాకు సంబంధించిన సమాచారాన్ని స్క్రీన్ షాట్ల రూపంలో తీసి అనుచితంగా వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఈ వ్యవహారం మరింతగా ముదిరిపోయింది. ఇందులో కూటమి కార్యకర్తలు సాయి తేజ్‌కు, వైసీపీ వాళ్లు సదరు ఎన్నారైకు మద్దతు తెలుపుతున్నారు.


Click it and Unblock the Notifications











