ఏ మాయ చేసావె...హిందీ రీమేక్ డిటేల్స్
తెలుగులో సూపర్ హిట్టయిన ఏ మాయ చేసావె చిత్రం హిందీలోకి రీమేక్ చేయటం కన్ఫర్మ్ అయింది. అంబికా హిందూజా గ్రూప్ వారు ఈ చిత్రాన్ని రీమేక్ లో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పాలుపంచుకోనున్నారు. వారు రీసెంట్ గా తీన్ పత్తి చిత్రాన్ని నిర్మించారు. ఇంతకుముందు గౌతం మీనన్ చెలి చిత్రాన్ని రెహనా హై తేరా దిల్ మే పేరుటో రీమేక్ చేసారు. కానీ సక్సెస్ కాలేదు. దానికి కారణం ఆ చిత్ర నిర్మాతల ప్రవర్తనే అని అప్పట్లో గౌతం మీనన్ కామెంట్ చేసారు. అందుకే గౌతం ఈ సారి ఈ చిత్రాన్ని తన నిర్మాణంలో కార్పరేట్ భాగస్వామ్యం తీసుకుని దర్శకత్వం చేయాలని యోచిస్తున్నారు. ఇక హిందీలో జెస్సీ పాత్రకు త్రిషను తీసుకునే అవకాశం కనపడుతోంది. త్రిష తమిళ వెర్షన్ లో శింబు సరసన చేసింది.
త్రిష నాగ చైతన్య సమంతా శింబు ఏ మాయ చేసావె తీన్ పత్తి చెలి మాధవన్ గౌతం మీనన్ ye maya chesave trisha naga chaitanya simbu teen patti cheli madhavan


Click it and Unblock the Notifications