వందరోజులు కాకుండానే 'ఏ మాయ చేసావె' డీవిడీ రిలీజ్
నాగచైతన్య రెండో చిత్రం 'ఏ మాయ చేసావె' వీసీడీ, డీవీడీలను నేడు మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నారు. వందరోజులు పూర్తవకుండా అప్పుడే ఈ చిత్రం డీవీడి రిలీజ్ చేయటం పట్ల అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సంజయ్ స్వరూప్ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 26న విడుదలైన ఈ చిత్రం ఎనభై ఐదు రోజులు మాత్రమే అయింది. ఇక ఈ డీవీడీలను మార్కెట్ చేస్తున్న ఓల్గా వీడియోస్ సంస్థ అధినేతలు ప్రసాద్, బాబ్జీ మాట్లాడుతూ -"యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకున్న ఈ చిత్రం వీడియోను అత్యుత్తమ నాణ్యతతో అందిస్తున్నాం. నేటికి ఈ సినిమా విడుదలై 85వ రోజు. క్రేజ్ ను దృష్టిలో పెట్టుకునే చాలా తొందరగా ఈ చిత్రాన్ని మార్కెట్ చేస్తున్నాం' అని చెప్పారు. ఇక ఈ చిత్రాన్ని గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించారు. అలాగే ఈచిత్రంలో జెస్సీ గా నటించిన సమంతా ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ అయి పెద్ద హీరోలందరి సరసన బుక్కయింది.


Click it and Unblock the Notifications











