Salaar launch: బహుబలితో రాఖీ భాయ్.. ఈ ఫొటో చూస్తే ఫ్యాన్స్ కు పండగే..
ఇద్దరు అగ్ర హీరోలు ఎవరైనా ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే అభిమానులకు వచ్చే కిక్కు మామూలుగా ఉండదు. గతంతో పోలిస్తే మన హీరోలు చాలా వరకు ఎంతో స్నేహంగా ఉంటున్నారు. ఇక పాన్ ఇండియా ఫార్మట్ డోస్ పెరిగిన అనంతరం భాషతో సంబంధం లేకుండా హీరోలు ఒక్కటిగా కనిపిస్తున్నారు. ఇక చాలా రోజుల తరువాత ప్రభాస్, యష్ ఒక ఫొటోలో కనిపించడం ఆడియెన్స్ ను ఎంతగానో ఎట్రాక్ట్ చేస్తోంది.

తెలుగులో హై డిమాండ్
కన్నడ KGF సినిమా స్థాయి పెరగడంతో మన టాలీవుడ్ పాత్ర ఎంతో ఉంది. తెలుగు ఆడియెన్స్ కూడా ఆ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారు. ఇక యష్ కు తెలుగులో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా గట్టిగానే పెరిగింది. KGF 2 కోసం తెలుగు ఆడియెన్స్ కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నట్లు ఇటీవల వచ్చిన టీజర్ తో ఒక క్లారిటీ వచ్చేసింది. తెలుగు వాళ్లే ఎక్కువగా ఆ సినిమా కోసం ఎదురుచూస్తున్నట్లు కామెంట్ చేశారు.

మొదలైన సలార్..
ఇక ఆ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సలార్ సినిమా చేయడానికి సిద్దమవుతున్న విషయం తెలిసిందే. ఇక ఫైనల్ గా హైదరాబాద్ లో నేడు సినిమాను గ్రాండ్ గా లాంచ్ చేశారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందించనున్న ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నట్లు ఒక హింట్ ఇచ్చేశారు.

ప్రభాస్, యష్.. ఒకే ఫ్రేమ్ లో..
ఇక సలార్ మూవీ లాంచ్ కోసం KGF హీరో యష్ కూడా వచ్చేశాడు. రాజమౌళితో పాటు కొంతమంది సినీ ప్రముఖులు ప్రభాస్ స్నేహితులు వేడుకలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. ముఖ్యంగా యష్, ప్రభాస్ కలిసి ఫోటోలకు నవ్వుతూ స్టిల్ ఇవ్వడం అభిమానులను ఎంతగానో ఎట్రాక్ట్ చేస్తోంది. మొదటి ఫొటో అలా సోషల్ మీడియాలో పడిందో లేదో ఒక్కసారిగా వైరల్ అయ్యింది.

KGF 2 విడుదలైన తరువాతే..
ఇక సలార్ సినిమాను కూడా పాన్ ఇండియన్ ప్రాజెక్టుగా నిర్మించబోతున్నారు KGF నిర్మాతలు. ఇప్పటికే ఫుల్ స్క్రిప్ట్ ను పూర్తి చేసుకున్న దర్శకుడు ప్రశాంత్ KGF చాప్టర్ 2 విడుదల అనంతరం సలార్ రెగ్యులర్ షూటింగ్ ను స్టార్ట్ చేయడానికి ప్లాన్ రెడీ చేసుకుంటున్నాడు. ఇక సినిమాలో బాలీవుడ్ కు చెందిన ఇద్దరు అగ్ర హీరోయిన్స్ ను ఫిక్స్ చేసే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











