twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Year End 2021 : సిరి వెన్నెల టు పొట్టి వీరయ్య.. 2021లో టాలీవుడ్ కు దూరమైన వారు ఎవరంటే?

    |

    2021 సంవత్సరం ఆఖరి దశలో ఉంది. ఈ యేడాది ప్రపంచవ్యాప్తంగా అనేక ఘటనలు జరిగాయి. జనవరి నుంచి మొదలుకుని డిసెంబర్‌ వరకు ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల మంది కరోనా కారణంగా మరణించారు. అదే సమయంలో భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన అనేకమంది ప్రముఖులు కోవిడ్‌తోపాటు మరికొన్ని ఆరోగ్య సమస్యలతో కన్నుమూశారు. ఈ ఏడాది టాలీవుడ్‌ కు చెందిన పలువురు ప్రముఖులు ఈ ప్రపంచానికి వీడ్కోలు పలికారు. వారు ఎవరెవరు అనేది చూద్దాం.

     సిరివెన్నెల సీతారామశాస్త్రి:

    సిరివెన్నెల సీతారామశాస్త్రి:

    ఈ ఏడాది నవంబర్ 30న ప్రముఖ సినీ గేయ రచయిత 'సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూశారు. 66 సంవత్సరాల వయసులో తీవ్రమైన న్యుమోనియాతో బాధపడుతూ నవంబర్‌ 24న సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆస్పత్రిలో చేరారు. ఆయన ఊపిరితిత్తుల్లో ఆరేళ్ల క్రితం కేన్సర్‌ను గుర్తించగా అప్పట్లోనే రెండు ఊపిరితిత్తుల్లో ఒకదాన్ని తొలగించారు. తర్వాత బైపాస్‌ సర్జరీ చేశారు. ఇటీవల రెండో ఊపిరితిత్తికీ కేన్సర్‌ సోకడంతో 50శాతం తొలగించాల్సి వచ్చింది. ఆక్సినేషన్‌ సరిగా లేకపోవడంతో ఆయన్ను 5 రోజుల పాటు కిమ్స్‌లో ఎక్మోపై ఉంచారు. కేన్సర్‌ కారణంగా రెండు ఊపిరితిత్తులు పాడైపోవడం, బైపాస్‌ సర్జరీ కావడంతో కోలుకోలేక ఆయన కన్నుమూశారు.

    టీఎన్ఆర్

    టీఎన్ఆర్

    ఈ ఏడాది మే 10న ప్రముఖ యూట్యూబ్‌ యాంకర్‌, జర్నలిస్ట్‌, నటుడు టీఎన్‌ఆర్‌ కరోనాతో కన్నుమూశారు. కరోనా బారినపడిన ఆయన చికిత్స పొంది కోలుకుంటూ శ్వాస సంబంధ ఇబ్బందులతో ఆసుపత్రిలో చేరి పోరాడి తుది శ్వాస విడిచారు. యూట్యూబ్‌ వేదికగా టీఎన్ఆర్ ఎంతో మంది సినిమా ప్రముఖులను ఇంటర్వ్యూ చేసి సూటి ప్రశ్నలతో మెప్పించడంతో మంచి ఆసక్తికరంగా సాగేవి. ఇక సుమంత్‌ హీరోగా వసిగ్గుబా 'బోణి' చిత్రంలో కనిపించేది కొద్దిసేపే అయినా మంత్రి పాత్ర పోషించారు. 'నేనే రాజు నేనే మంత్రి', 'జార్జిరెడ్డి', 'సుబ్రహ్మణ్య పురం', 'ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య' తదితర చిత్రాల్లో గుర్తుండిపోయే పాత్రల్లో నటించారు.

    బీఏ రాజు

    బీఏ రాజు

    టాలీవుడ్ కి చెందిన ప్ర‌ముఖ పీఆర్వో, నిర్మాత బీఏ రాజు మే 22న గుండె పోటు కార‌ణంగా మృతి చెందారు. సినిమా జ‌ర్న‌లిస్టుగా కెరీర్ మొద‌లు పెట్టిన బీఏ రాజు.. స్టార్ యాక్ట‌ర్ల‌కు పీఆర్ఓగా వ్య‌హ‌రించారు. కేవ‌లం పీఆర్వోగానే కాకుండా నిర్మాత‌గా మారి ప‌లు సినిమాలు కూడా తెర‌కెక్కించారు రాజు. 'సూపర్‌హిట్‌' అనే సినీ పత్రికను నడిపిన ఆయన.. సుమారు 1500 చిత్రాలకు పైగా సినిమాలకు పీఆర్వోగా పనిచేశారు. నిర్మాతగా కూడా ఆయన భార్య బి. జయ దర్శకత్వంలో వచ్చిన.. చంటిగాడు, ప్రేమికులు, గుండమ్మ గారి మనవడు, లవ్లీ, సవాల్, వైశాఖం వంటి చిత్రాలను నిర్మించారు.

     నటి జయంతి

    నటి జయంతి

    ప్రముఖ నటి జయంతి 76 ఏళ్ళ వయసులో జులై నెల 26న కన్నుమూశారు. గత కొన్నేళ్లుగా ఆమె శ్వాసకోస సంబంధింత వ్యాధితో ఆమె బాధపడుతున్నారు. 1949, జనవరి 6న ఆంధ్రప్రదేశ్ శ్రీ కాళహస్తిలో జన్మించిన ఆమె తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల్లో నటించారు. ఎన్టీఆర్, నాగేశ్వరరావు సినిమాల్లో కూడా నటించిన ఆమె సుమారు 500 సినిమాల దాకా చేశారు. తెలుగులో మోహన్ బాబు నటించిన పెదరాయుడు చిత్రంలో ఆమె నటనకు మంచి గుర్తింపు వచ్చింది. రు.

    వేదం నాగయ్య :

    వేదం నాగయ్య :


    క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన వేదం సినిమాలో నటించిన మెప్పించి మొదటి సినిమానే ఇంటి పేరుగా మార్చుకున్న నాగయ్య మార్చ్ 27న మరణించారు. వేదంతో మొదలైన సిని ప్రయాణం ముప్పై సినిమాల వరకు సాగింది. గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన నాగయ్య.. బతుకు కష్టాలతో హైదరాబాద్‌ చేరుకున్నాడు. అక్కడే నిర్మాత రాధాకృష్ణ కంట పడి వేదం సినిమాలో అవకాశం పొందారు. అలా వేదం, నాగవల్లి , ఒక్కడినే, స్టూడెంట్‌ స్టార్, ఏమాయ చేశావే, రామయ్య వస్తావయ్యా, స్పైడర్ వంటి అనేక సినిమాల్లో నటించారు.

     శివ శంకర్

    శివ శంకర్


    ప్రముఖ నృత్య దర్శకుడు శివశంకర్ మాస్టర్ నవంబర్ 28న 72 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. కరోనాతో చికిత్స పొందుతూ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. 1974లో మాస్టర్ సలీమ్ వద్ద సహాయ నృత్యదర్శకుడిగా శివశంకర్ మాస్టర్‌ పనిచేశారు. తర్వాత భారతీయ చిత్ర పరిశ్రమలోని 10 భాషల్లో చిత్రాలకు నృత్యరీతులు సమకూర్చారు. 800 చిత్రాలకుపైగా డ్యాన్స్ మాస్టర్‌గా పనిచేసిన శివశంకర్ సుమారు 30 సినిమాల్లో నటించారు.

     మహేష్ కత్తి

    మహేష్ కత్తి

    ప్రముఖ సినీ నటుడు, విమర్శకుడు కత్తి మహేష్ శనివారం చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జులై 10న తుది శ్వాస విడిచారు. జూన్ 26న నెల్లూరు కొడవలూరు హైవే వద్ద లారీని ఢీ కొట్టడంతో భారీ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కత్తి మహేష్ ప్రయాణిస్తున్న కారు నుజ్జు నుజ్జు అయ్యింది. ఈ యాక్సిడెంట్‌లో కత్తి మహేష్ సీటు బెల్టు పెట్టుకోకపోవడం వల్ల తలతో పాటు కన్నుకి బలమైన గాయాలు అయ్యాయి. దీంతో ఆయనని హుటాహుటిన అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించడం ప్రారంభించారు. అయితే ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో సుమారు పదిహేను రోజులు చికిత్స పొంది చెన్నైలో కన్నుమూశారు.

    Recommended Video

    Sirivennela Seetharama Sastry Garu మూగబోయిన సిరివెన్నెల || Filmibeat Telugu
    పొట్టి వీరయ్య

    పొట్టి వీరయ్య


    నటుడు పొట్టి వీరయ్య ఏప్రిల్ 25న కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పొట్టి వీరయ్య గుండెపోటు రావడంతో ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. ప‌రిస్థితి విష‌మించ‌డంతో మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో దాదాపు 500కుపైగా చిత్రాల్లో వీర‌య్య న‌టించాడు. పొట్టి వీరయ్య అసలు పేరు గట్టు వీరయ్య. విఠలాచార్య 'అగ్గివీరుడు' చిత్రంతో నటుడిగా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మ‌యిన ఆయన 'రాధమ్మ పెళ్లి', 'యుగంధర్‌', 'జగన్మోహిని', 'గజదొంగ', 'అత్తగారి పెత్తనం', 'గోల నాగమ్మ', 'టార్జాన్‌ సుందరి' తదితర చిత్రాల్లో పొట్టి వీరయ్య నటించారు.

    English summary
    Tollywood Celebrities Who Died in 2021.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X