Year Ender 2024: టాలీవుడ్ టాప్ డిజాస్టర్ మూవీస్.. పాన్ ఇండియా హీరోలకు సైతం ఎదురుదెబ్బే..
Biggest flops of 2024: 2024 కు మరికొద్ది రోజులలో ఎండ్ కార్డు పడబోతుంది. కొత్త ఆశలతో నూతన సంవత్సరాన్ని ఆహ్వానించడానికి అందరు సిద్ధమవుతున్నారు. ఈ సమయంలో గత సంవత్సరంలోని జ్ఞాపకాలను నెమరువేస్తూ కొత్త ప్రణాళికలను రూపొందించుకుంటున్నారు. ఇక ఏడాది సినిమా ఇండస్ట్రీలో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. కొన్ని సినిమాలు సూపర్ డూపర్ హిట్స్ కాగా.. మరికొన్ని డిజాస్టర్ గా మిగిలాయి. స్టార్ డైరెక్టర్లకు పాన్ ఇండియా హీరోలకు సైతం ఈ ఏడాది ఓటమి తప్పలేదు. అలా ఈ ఏడాది భారీ డిజాస్టర్ గా మిగిలిన టాప్ సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం..
కంగువ (Kanguva)
తమిళ సూపర్ స్టార్ సూర్య నటించిన భారీ బడ్జెట్ సినిమా కంగువ. సక్సెస్ఫుల్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో తెరకెక్కింది.
ఈ సినిమా ఎన్నో అంచనాలతో నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది భారీ అంచనాలతో దాదాపు రూ. 350 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా తొలి తొలిరోజే నెగటివ్ టాక్ సొంతం చేసుకోండి. దీంతో కేవలం 105 కోట్లు మాత్రమే రాబట్టి ఈ ఏడాదిలో అత్యంత భారీ డిజాస్టర్ సినిమాగా నిలిచింది. ఈ సినిమాలో అగ్ర కథానాయకులు బాలీవుడ్ యాక్టర్స్ హాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేసిన సక్సెస్ కాలేకపోయింది బాక్సాఫీస్ ముందు బోర్ల పడింది.

భారతీయుడు 2 (Indian 2)
సెన్సేషన్స్ కు కేరాఫ్ డైరెక్టర్ శంకర్. సినిమాను వైవిద్యంగా తెరకెక్కించి కమర్షియల్ గా హిట్ కొట్టించగల దర్శకుడు శంకర్. ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఓటమి ఎరగని డైరెక్టర్ కూడా శంకర్ అలాంటిది భారతీయుడు 2 సినిమాతో ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన కమలాసన్ భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా వచ్చిన భారతీయుడు 2 సినిమా మాత్రం డిజాస్టర్ గా మిగిలి అత్యంత దారుణమైన రికార్డులను మూట కట్టుకుంది. ఈ సినిమా దాదాపు 250 కోట్ల ఖర్చుతో నిర్మిస్తే కేవలం 150 కోట్లు మాత్రమే వసూలు చేసింది అంటే ఎలాంటి డిజాస్టర్ గా మిగిలిందో అర్థం చేసుకోవచ్చు ఇక్కడ కమల్ హాసన్ క్రేజ్ గాని, డైరెక్టర్ శంకర్ పాపులారిటీ గాని వర్కౌట్ కాలేదు దీంతో భారతీయుడు 2 ఈ ఏడాది డిజాస్టర్ మూవీగా నిలిచింది.
మైదాన్ (Maidaan)
బాలీవుడ్ స్టార్ హీరోలకు సైతం ఈ ఏడాది బ్యాక్ టైమ్ నడిచిందనే చెప్పాలి. అందులో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ నటించిన భారీ బడ్జెట్ మూవీ మైదాన్. ఈ సినిమాకు అమిత్ రవీందర్ నాథ్ శర్మ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను రూ. 250 కోట్లతో నిర్మించారు. ఎన్నో అంచనాల మధ్య వరల్డ్ వైస్ గా విడుదలైన ఈ సినిమా కేవలం 70 కోట్లు మాత్రమే రాబట్టగలిగింది. దీంతో విడుదలైన రెండు వారాల్లోనే ఓటీడీలో విడుదల చేయవలసి వచ్చింది.

బడే మియాన్ చోటే మియన్ (Bade Miyan Chote Miyan)
బాలీవుడ్ స్టార్ హీరోస్ అక్షయ్ కుమార్ టైగర్ ష్రాఫ్ నటించిన సినిమా కూడా భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమాకు అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించారు. 350 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను కామెడీ జోనర్ గా తెరకెక్కించారు. ఈద్ పండుగ సందర్భంగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధిస్తుందని అందరూ ఊహించారు. కానీ, ఎవరు ఊహించని విధంగా డిజాస్టర్ గా మిగిలింది కేవలం రూ . 60 కోట్లు మాత్రమే వసూలు చేసి 2024 డిజాస్టర్ మూవీ లిస్టులో చేరింది.
జిగ్రా (Jigra)
బాలీవుడ్ సూపర్ స్టార్ హీరోయిన్ అలియా భట్, వేదంగ్ రైనా కలిసి నటించిన మూవీ జిగ్రా. ఈ మూవీ 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది. భారీ అంచనాల నడుమ ఇండియా వైడ్ గా విడుదలైన ఈ సినిమాకు ఊహించని రీతిలో ఎదురుదెబ్బ తగిలింది. కేవలం 55 కోట్లు రాబట్టి మూవీ మేకర్లను నిరాశపరిచింది. అలియా భట్ కెరీర్లో భారీ డిజాస్టర్ మూవీగా నిలిచింది జిగ్రా.


Click it and Unblock the Notifications











