Year Ender 2024: ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సత్తా చాటిన తెలుగు హీరోలు ఎవరంటే?
Year Ender 2024: మరికొన్ని రోజులలో 2024 శుభం కార్డు పడనుంది. కొత్త ఏడాది 2025 కు ఘనంగా స్వాగతం పలికేందుకు అందరూ సిద్ధమయ్యారు. కొత్త సంవత్సరం, కొత్త ప్లాన్స్, కొత్త ప్రణాళికలు వేసుకుంటూ ముందుకు సాగాలని భావిస్తున్నారు. ఈ తరుణంలో టాలీవుడ్ లో ఈ ఏడాది 2024 లో సత్తా చాటిన హీరోలు ఎవరు? ప్లాప్ అయినా హీరోలు ఎవరు? ఆ సినిమాలేంటో ఓ లుక్కేద్దాం.
2024లో కూడా పెద్ద హీరోలు చిన్న హీరోలు అనే భేదం లేకుండా కంటెంట్ బాగుంటే చాలు చిన్న సినిమాలు కూడా ఇండస్ట్రీ హిట్టుగా నిలిచాయి. ఈసారి సంక్రాంతి బరిలో సూపర్ స్టార్ మహేష్ బాబు (MAHESH BABU)'గుంటూరు కారం'తో బరిలో నిలిచారు. ఈ మూవీ మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో రావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో కుర్చీ మడత పెట్టి సాంగ్స్ సోషల్ మీడియాలో దుమ్ము రేపింది. క్లాస్ లుక్ లో గ్లామరస్ గా కనిపించే మహేష్ బాబును చాలా రోజుల తర్వాత మాస్ లుక్కులో చూపించడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. కానీ విడుదలైన తర్వాత ఊహించని నిరాశ ఎదురైంది. ప్రీమియర్ షో నుండి నెగటివ్ రివ్యూస్, నెగిటివ్ టాక్ రావడంతో మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా నిరాశ కు లోనయ్యారు. స్వయంగా సినిమా నిర్మాత నాగ వంశీ మాట్లాడుతూ ఫ్యామిలీ సినిమాకు మాస్ టైటిల్, మాస్ ప్రమోషన్ చేయడం తో పొరపాటు జరిగిందని ఒప్పుకున్నారు. ఇలా మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలా హ్యాట్రిక్ ఫెయిల్యూర్ గా 'గుంటూరు కారం' నిలిచింది.

అలాగే సంక్రాంతి బరిలో విక్టరీ వెంకటేష్ (VENKATESH) 'సైంధవ్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. వాస్తవానికి విక్టరీ వెంకటేష్ సినిమాలు విడుదల సంక్రాంతికి విడుదల కావడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సందర్భంగా విడుదలయ్యే ఏ సినిమా అయినా కచ్చితంగా సూపర్ హిట్ గా నిలుస్తుంది. కానీ, ఈ సంక్రాంతి మాత్రం విక్టరీ వెంకటేష్ కు కలిసి రాలేదని చెప్పాలి. ఎన్నో అంచనాలతో విడుదలైన 'సైంధవ' మూవీకి శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన సైంధవ మూవీ బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్ల పడింది. విక్టరీ వెంకటేష్ కెరియర్ లో డిజాస్టర్ గా మిగిలిపోయింది.
ఇక ఇదే సంక్రాంతి బరిలో కింగ్ నాగార్జున (NAGARJUNA) కూడా 'నా సామిరంగా' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాకు విజయ్ బిన్నీ దర్శకత్వం వహించారు. ఈ సినిమా పక్కా పండుగ సినిమా. భోగి ,సంక్రాంతి, కనుమ చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. అటు పాటల్లోనూ కథలోనూ సంక్రాంతి పండుగ కళ ఉట్టిపడుతుంది. అయితే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలుస్తుందని మూవీ మేకర్స్ ఎంతగానో ఆశపడ్డారు. ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా సంక్రాంతి బరిలో దించారు. కానీ, అటు హిట్ కాకుండా ఇటు ఫెయిల్యూర్ కాకుండా మూవీ మేకర్స్ కు ఎలాంటి నష్టాలు తీసుకురాకుండా మిగిలిపోయింది.
ఇక మాస్ మహా రాజా రవితేజకు (Ravi Teja) కూడా 2024 కలిసి రాలేదని చెప్పాలి. ఈ సంవత్సరం మాస్ మహారాజా ఈగల్, మిస్టర్ బచ్చన్ అనే సినిమాలతో ప్రేక్షకు ముందుకు వచ్చారు. వాస్తవానికి 'ఈగల్' అనే సినిమా సంక్రాంతికి రావాల్సింది. కానీ, సినిమాల కొరత వల్ల ఈ సినిమా ఫిబ్రవరిలో విడుదలైంది. సోలో డేట్ దొరికినప్పటికీ బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయింది. రవితేజ కెరీర్లో డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఇక బాలీవుడ్ 'రైడ్' సినిమాని రవితేజ మిస్టర్ బచ్చన్ గా రీమేక్ చేశారు. ఈ సినిమాకు హరిశంకర్ దర్శకత్వం వహించారు. వీరిద్దరి కాంబోలో తెరకెక్కిన ఈ మూవీ పై ఎన్నో అంచనాలను నెలకొన్నాయి. అటు ప్రోమోకు..పవర్ ఫుల్ డైలాగ్ లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ తీరా విడుదలైన తర్వాత అంచనాలు తారుమారయ్యాయి. ఈ సినిమా కూడా అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. అటు నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కూడా నష్టాల పాలయింది.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (PRABHAS) కు మాత్రం ఈ 2024 కలిసి వచ్చిందనే చెప్పాలి. నాగ్ ఆశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'కల్కి' సినిమాతో ఇండస్ట్రీలో రికార్డులను తిరగరాశారు. ఈ సినిమా ఫ్యాన్ ఇండియా స్థాయిలో ప్రభంజనాన్ని సృష్టించింది. బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీని సృష్టించింది. బాక్సాఫీస్ వద్ద 1000 కోట్లు వసూలు చేసిన సౌత్ ఇండియా మూవీగా రికార్డు క్రియేట్ చేసింది. అలాగే బాక్సాఫీస్ వద్ద రెండుసార్లు 1000 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసిన హీరోగా ప్రభాస్ నిలిచారు. అంతకుముందు బాహుబలి 2 సినిమా 10 రోజులలో 100 కోట్లు వసూలు చేసింది. ఇక కల్కి సినిమా 15 రోజులలో ఆ రికార్డును బ్రేక్ చేసింది. మరోవైపు నార్త్ అమెరికాలో అత్యధిక వసూలు సాధించిన మూవీగా కల్కి రికార్డు క్రియేట్ చేసింది.
పాన్ ఇండియా హీరో మాస్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్(NTR) నటించిన మూవీ దేవర( DEVARA). ఈ మూవీ కూడా 2024లో బ్లాక్ బస్టర్ మూవీ గా నిలిచింది. ఈ బ్లాక్ బస్టర్ మూవీకి కొరటాల శివ దర్శకత్వం వహించారు. నార్త్ ఇండియాలో అత్యంత వేగంగా 1 మిలియన్ ప్రీ సేల్ టికెట్స్ అమ్మిన తొలి ఇండియన్ మూవీ గా అరుదైన రికార్డును క్రియేట్ చేసింది ఎన్టీఆర్ దేవర. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమా యావరేజ్ టాక్ సొంతం చేసుకున్నా.. ఎన్టీఆర్ సేమ్ తో ముందుకు సాగింది. కలెక్షన్ల విషయంలో వరల్డ్ వైడ్ గా 500 కోట్ల గ్రాస్ ను సాధించింది. ఇక 52 కేంద్రాలలో 50 రోజులు పూర్తి చేసుకోవడం మరో ప్రత్యేకత.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (ALLU ARJUN) డిసెంబర్ 5న పుష్ప 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. పుష్ప 2 సినిమాలో ఎవరు ఊహించని విధంగా 12 కు పైగా థియేటర్లలో రిలీజ్ అయి ఇండియన్ ఫిలిం హిస్టరీలో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. విడుదల కాక ముందుకే రూ. 1,000 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసింది సినిమా పుష్ప 2. ఇక పాన్ ఇండియా వైడ్ గా రూపొందిన ఈ సినిమా ఎవరు ఊహించని విధంగా కేవలం ఆరు రోజులలోనే 1000 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసి ఇండియన్ సినిమా హిస్టరీలోనే అరుదైన రికార్డును క్రియేట్ చేసింది. అటు నార్త్ ఇట్ సౌత్ లో పుష్పరాజు హవా కొనసాగుతూనే ఉంది. అల్లు అర్జున్ పుష్ప స్వాగ్ ఆయన మేనరిజం మరోసారి ఇండియన్ ప్రేక్షకులను ఫిదా అయ్యేలా చేసింది. ఈ సినిమా ప్రభంజనంలో కలిపి RRR సినిమాల రికార్డులు కొట్టుకుపోయే అంటే పుష్ప సృష్టించిన సునామీ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. మొత్తానికి ఈ ఏడాది అల్లు అర్జున్ కెరీర్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ గా నిలిచిందనే చెప్పాలి.
మరోవైపు అగ్ర హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ ల సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఇక RRR తర్వాత రామ్ చరణ్ కూడా చాలా గ్యాప్ తీసుకున్నారు. వాస్తవానికి రామ్ చరణ్ - శంకర్ కాంబోలో తెరకెక్కిన గేమ్ చేంజర్ ఈ ఏడాది చివర్లో ప్రేక్షకు ముందుకు రావాల్సింది. కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల ఈ సినిమా సంక్రాంతి రేసులో నిలిచింది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యాక్టివ్ పాలిటిక్స్ లో బిజీ కావడం తన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసి అసెంబ్లీ లో అడుగుపెట్టారు. సమయం దొరికినప్పుడల్లా తన సైన్ చేసిన సినిమాలలో నటిస్తూ ఉన్నారు. మొత్తానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు 2024 మాత్రం మర్చిపోలేని ఓ గొప్ప మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుంది అనడంలో ఎలాంటి అతిశక్తి లేదు.


Click it and Unblock the Notifications











