Year Ender 2024: 2024లో వచ్చిన సీక్వెల్స్​ ఇవే.. ఎన్ని హిట్టు? ఎన్ని ఫట్టు?

2024 Sequel Movies: సాధారణంగా ఏదైనా ఒక సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిస్తే.. ఆ సినిమాకు సీక్వెల్ గా మరో మూవీ తెరకెక్కిస్తున్నారు. అలా టాలీవుడ్ లో సీక్వెల్స్ ట్రెండ్ కొనసాగుతుంది. 2024లో సీక్వెల్ గా తెరకెక్కిన మూవీస్ లలో కొన్ని సినిమాలు భారీ బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిస్తే.. మరికొన్ని డిజాస్టర్ గా నిలిచి.. ప్రొడ్యూసర్లకు భారీ నష్టాలను తెచ్చిపెట్టాయి. అలా ఈ ఏడాది (2024) సీక్వెల్ గా తెరకెక్కిన మూవీస్ ఏంటి? అందులో హిట్ మూవీస్ ఏంటి? నష్టాలు తెచ్చిన ఫ్లాప్ మూవీస్ ఏంటి? వివరాల్లోకెళ్తే..

హిట్ అందుకున్న సీక్వెల్స్..

మత్తు వదలరా 2:

సంగీత దర్శకుడు ఎమ్. ఎమ్. కీరవాణి తనయుడు శ్రీ సింహ హీరోగా ఎంట్రీ ఇచ్చిన మత్తు వదలరా. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ఆ సినిమాకు సీక్వెల్ గా ఐదు సంవత్సరాల తర్వాత 'మత్తు వదలరా 2' వచ్చింది. ఈ సినిమాకు రితీష్ రానా దర్శకత్వం వహించగా శ్రీ సింహ, సత్య, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రలో నటించారు. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ, ఎవరు ఊహించని విధంగా పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ప్రొడ్యూసర్లకు ఊహించని విధంగా కాసుల వర్షాన్ని కురిపించింది. మరోవైపు ఓటీటీలో కూడా రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ అందుకుంది.

Year Ender 2024 Tollywood sequel movies of 2024 pushpa 2 mathu vadalara 2 double ismart tillu square results

టిల్లు స్క్వేర్

యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ కథనాయకుడిగా తెరకెక్కిన సినిమా 'డీజే టిల్లు'. ఈ సినిమా 2022లో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన సినిమానే 'టిల్లు స్క్వేర్'.. ఈ సినిమాలో జొన్నలగడ్డ హీరోగా నటించిన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా కూడా ఎవరు ఊహించని విధంగా పాజిటివ్ స్టాక్ సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకొని దాదాపు 125 కోట్ల కు పైగా వసూలు రాబట్టింది. ఇలా అనూహ్య విజయాన్ని అందుకోవడంతో 'డీజే టిల్లు 3' కూడా తెరకెక్కించడానికి మూవీ మేకర్స్ ప్రయత్నిస్తున్నారు అతి త్వరలో ఈ సినిమా ప్రకటన రాబోతున్నట్లు సమాచారం.

Year Ender 2024 Tollywood sequel movies of 2024 pushpa 2 mathu vadalara 2 double ismart tillu square results

పుష్ప 2

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా పుష్ప. మూడు సంవత్సరాల క్రితం విడుదలైన ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఎవరు ఊహించని విధంగా నార్త్ లో కూడా బ్లాక్ బస్టర్ హిట్ సాధించి బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను వసూలు చేసింది. ఇలా భారీ విజయాన్ని అందుకోవడంతో ఆ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కిన సినిమా నే ' పుష్ప 2 '. ఈ సినిమాలో అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందాన హీరోయిన్ గా, ఫహిద్ ఫజిల్ విలన్ పాత్రలో నటించారు. భారీ అంచనాల నడుమ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయింది.

ఎవరు ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద పుష్పరాజ్ తన రూలింగ్ ను కొనసాగిస్తున్నాడు. కేవలం మూడు రోజులలో 500 కోట్లు, వారం రోజులలో 1000 కోట్ల మార్కును, 14 రోజులలో 1500 కోట్ల మార్కును దాటి పలు పాన్ ఇండియా సినిమాల రికార్డులను బ్రేక్ చేసింది పుష్ప 2. భారతీయ సినిమా ఇండస్ట్రీలో ఆల్ టైం బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది పుష్ప 2. ఈ బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్ గా పుష్ప 3.. పుష్ప ది రాంపేజ్ మూవీ తెరకెక్కబోతున్నట్లు సమాచారం.

ఇక ఈ ఏడాది ప్లాప్ సీక్వెల్ సినిమాల విషయానికి వస్తే..

డబుల్ ఇస్మార్ట్

పూరి జగన్నాథ్ - రామ్ పోతినేని కాంబినేషన్లో తెరకెక్కిన 'ఇస్మార్ట్ శంకర్' సీక్వెల్ గా తెరకెక్కిన సినిమా నే 'డబుల్ ఇస్మార్ట్'. ఎన్నో అంచనాల మధ్య పాన్ ఇండియా మూవీ గా విడుదలైన ఈ సినిమా తీవ్ర నిరాశ మిగిల్చింది. ప్రొడ్యూసర్లకు ఘోర పరాజయాన్ని మిగిలించిందనే చెప్పాలి.

Year Ender 2024 Tollywood sequel movies of 2024 pushpa 2 mathu vadalara 2 double ismart tillu square results

ప్రతినిధి 2

రానా రోహిత్ హీరోగా రాజకీయ నేపథ్యంతో తెరకెక్కిన సినిమా 'ప్రతినిధి 2'. ఆయన గతంలో నటించిన ప్రతినిధికి ఇది సీక్వెల్. ఈ సినిమాను పాత్రికేయుడు మూర్తి తెరకెక్కించారు. ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ డిజాస్టర్ ను మూటగట్టుకుంది. అలాగే యాత్ర 2, గీతాంజలి 2, ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన భామ కలాపం 2 వంటి సినిమాలు సీక్వెల్స్ గా తెరకెక్కాయి. ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నిరాశ మిగిల్చాయి.

ఇక జై హనుమాన్, హిట్ 3, అఖండ 2:తాండవం, దేవర 2, కల్కి 2, సలార్ 2, పొలిమేర 3, కార్తికేయ 3, ఆదిత్య 999, బింబిసారా 2, శతమానం భవతి 2, ఫలక్నామా దాస్ 2, ఈ నగరానికి ఏమైంది 2, మంగళవారం 2 వంటి సినిమాలు రాబోతున్నాయి. ఈ సినిమాలపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. మరి వచ్చే ఏడాది రిలీజ్ కాబోతున్న ఈ సీక్వెల్స్ ప్రేక్షకులను ఎలా అలరిస్తాయో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్స్ వసూలు చేస్తాయో వేచి చూడాల్సిందే. ఈ ఏడాది విడుదలైన సీక్వెల్స్ లలో మాత్రం మిశ్రమ స్పందన వచ్చిందని చెప్పాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X