twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    భీభత్సం సృష్టిస్తున్న బూతు టీజర్.. 16 మిలియన్లు దాటేసి!

    |

    ప్రస్తుతం సినిమా మార్కెట్ లో బోల్డ్ కంటెంట్ చిత్రాల ట్రెండ్ నడుస్తోంది. ఆ జోనర్ లో వచ్చిన కొన్ని చిత్రాలు ఇటీవల ఘన విజయం సాధించడం చూశాం. ఆ చిత్రాల బాటలోనే ఇంకాస్త ఎక్కువ మాసాలతో ఏడు చేపల కథ అనే చిత్రం వస్తోంది. ఇటీవల సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఏడు చేపల కథ పేరు వినిపిస్తోంది. దీనికి కారణం ఆ చిత్ర టీజర్ సృష్టిస్తున్న భీభత్సమే. ఇటీవల ఏడు చేపల కథ టీజర్ విడుదలై ఒక్కసారిగా అలజడి రేపింది.

    తెలుగు అడల్ట్ మూవీలో బిగ్‌బాస్ భానుశ్రీ... సంచలనం రేపుతున్న టీజర్! తెలుగు అడల్ట్ మూవీలో బిగ్‌బాస్ భానుశ్రీ... సంచలనం రేపుతున్న టీజర్!

    16 మిలియన్ల వ్యూస్

    16 మిలియన్ల వ్యూస్

    ఈ టీజర్ కి వస్తున్న రెస్పాన్స్ చూసి చిత్ర యూనిట్ కూడా షాక్ అవుతోంది. యూట్యూబ్ లో అన్ని ఛానల్స్ లో కలిపి ఏడు చేపల కథ టీజర్ కు 16 మిలియన్లకు పైగా వ్యూస్ రావడం విశేషం. తమిళంలో కూడా ఈ టీజర్ సంచలనం సృష్టిస్తోంది.

    బూతు సినిమాలో బిగ్ బాస్ భామ.. వైరల్ అవుతున్న దృశ్యాలు! బూతు సినిమాలో బిగ్ బాస్ భామ.. వైరల్ అవుతున్న దృశ్యాలు!

    టెంప్ట్ రవి

    టెంప్ట్ రవి

    ఈ చిత్రంలో నటుడు అభిషెష్ పచ్చిపాల టెంప్ట్ రవిగా ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. అమ్మాయిలని చూస్తే తన కోరికలని ఆపుకోలేని వింత రోగంతో హీరో భాధపడుతుంటారు. ఈ పాయింట్ చుట్టూ అడల్ట్ కామెడీ అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

    బిగ్ బాస్ భానుశ్రీ

    బిగ్ బాస్ భానుశ్రీ

    ఈ చిత్రాల్లో ఎక్కువగా నూతన నటీనటులే నటిస్తున్నారు. బిగ్ బాస్ ఫేమ్ భానుశ్రీ, అయేషా తదితరులు ఈ చిత్రంలో బోల్డ్ రోల్స్ లో నటిస్తున్నారు. అడల్ట్ కామెడీ జోనర్ లో చాలా చిత్రాలు వచ్చాయి. ఇలాంటి సినిమా ఇంతవరకు రాలేదనే ప్రశంసలు టీజర్ కు దక్కుతున్నాయని చిత్ర యూనిట్ తెలిపింది.

    త్వరలో విడుదల

    త్వరలో విడుదల

    శ్యామ్ జె చైతన్య ఈ చిత్రానికి దర్శకుడు. టీజర్ చూసిన ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారని చైతన్య తెలిపాడు. త్వరలోనే ఈ చిత్ర విడుదలకు సంబందించిన వివరాలు తెలియజేస్తాం అని చిత్ర యూనిట్ తెలిపింది. తక్కువ బడ్జెట్ లో బోల్డ్ కంటెంట్ తో నిర్మించిన సినిమా కావడంతో లాభాలు తెచ్చిపెడుతుందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

    English summary
    Yedu Chepala Katha became sensation in social media. Teaser got 16 million views in short time
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X