‘ఏడు చేపల కథ’కు షాకింగ్ బిజినెస్.. ఫ్యాన్సీ రేటుకు హ‌క్కులు!

టీజర్, ట్రైలర్‌తో సంచ‌ల‌నం సృష్టించిన ఏడుచేప‌ల క‌థ హ‌క్కులు ఫ్యాన్సీ రేటుకు అమ్ముడు పోవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ చిత్రానికి సంబంధించి వ‌రల్డ్‌వైడ్ థియెట్రిక‌ల్ రైట్స్‌ను శ్రీ ల‌క్ష్మి పిక్చ‌ర్స్ అధినేత బాపిరాజు ఫ్యాన్సీ రేటుకి సొంతం చేసుకొన్నారు. ఈ మూవీ టీజ‌ర్‌కు యూట్యూబ్‌, సోషల్ మీడియాలో అన్నీ క‌లిపి 18 మిలియ‌న్స్ (దాదాపు కొటి ఎన‌భై ల‌క్ష‌ల మంది ) వ్యూస్ రావ‌టం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా బిజినెస్ టాక్ ఆఫ్ టౌన్‌గా మారింది. వివరాల్లోకి వెళితే..

 సంచలనం రేపిన టీజర్

సంచలనం రేపిన టీజర్

అడల్డ్ కంటెంట్‌తో వస్తున్న ఏడు చేపల కథ కేవలం తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోనే కాకుండా కోలీవుడ్‌లోనూ ఈ టీజ‌ర్ సంచ‌ల‌నం రేపింది. ఈ చిత్రంలో టెంప్ట్ రవి అనే విభిన్నమైన పాత్రలో కనిపించిన హీరో అభి ఇప్ప‌టికే టీజ‌ర్ ద్వారా ప్రజాదరణను మూటగట్టుకొన్నాడు. అడల్డ్ కామెడీ జోనర్ లో పూర్తిగా కొత్త వారితో రూపోందుతున్న ఈ చిత్రంలో అభిషెక్‌ రెడ్డి తొ పాటు బిగ్ బాస్ ఫేం భాను శ్రీ,, ఆయేషా సింగ్, నగరం సునీల్ తదితరులు నటిస్తున్నారు.

ఫ్యాన్సీ రేటుకు హక్కులు

ఫ్యాన్సీ రేటుకు హక్కులు

చరిత సినిమా ఆర్ట్స్ పతాకం మీద డాక్టర్ రాకేష్ రెడ్డి గూడూరు సమర్పణలో శేఖర్ రెడ్డి, జీవీఎన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం హ‌క్కులు సొంతం చేసుకున్న శ్రీల‌క్ష్మి పిక్చ‌ర్స్ అధినేత బాపిరాజు మాట్లాడుతూ... . అడల్డ్ కామెడీ జోనర్ లో రూపొందించిన ఈ చిత్రం వ‌ర‌ల్డ్‌వైడ్ గా హ‌క్కులు మేము సొంతం చేసుకున్నాము అని తెలిపారు.

రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా

రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా

ఈ మ‌ధ్యకాలంలో RX100 అనే చిత్రం తర్వాత ఏడు చేపల కథ చిత్రానికి సంబంధించిన టీజ‌ర్‌కి భారీగా రెస్పాన్స్‌ వచ్చింది. యూత్‌లో మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ తరహా టీజ‌ర్ ఇప్ప‌టివ‌ర‌కూ టాలీవుడ్ లో రాలేదనే ప్రశంసలు దక్కుతున్నాయి. దర్శకుడు శామ్ జే చైతన్య విభిన్నమైన కాన్సెప్ట్‌ను రొమాంటిక్ ఎంటర్ టైనర్‌గా మలిచాడనే మాట వినిపిస్తున్నది అని బాపిరాజు పేర్కొన్నారు.

ఆసక్తి కలిగించే సీన్లతో

ఆద్యంతం ఆసక్తి కలిగించే సన్నివేశాలతో ఏడు చేపల కథ నడుస్తుంది. త్వ‌ర‌లో ఈ సినిమా మ‌రో టీజ‌ర్ ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తాము. హీరో అభిషేక్ రెడ్డి కి ఈ సినిమా చాలా మంచి పేరు తెస్తుంది. తన పెర్ ఫార్మెన్స్ తో ఇంప్రెస్ చేస్తాడు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన సెన్సేషనల్ అప్‌డేట్స్ ని తెలియ‌జేస్తాం అని బాపిరాజు అన్నారు.

 నటీనటులు, సాంకేతిక వర్గం

నటీనటులు, సాంకేతిక వర్గం

అభిషేక్ రెడ్డి, భానుశ్రీ,, ఆయేషా సింగ్, నగరం సునీల్ తదితరులు
బ్యానర్: చరిత సినిమా ఆర్ట్స్
సమర్పణ: డా.రాకేష్ రెడ్డి
నిర్మాతలు: శేఖర్ రెడ్డి, జివిఎన్
సహ నిర్మాత: గుండ్ర లక్ష్మీ రెడ్డి,
సంగీతం: కవి శంకర్,
కెమెరా: ఆర్లీ,
పిఆర్‌వో: ఏలూరు శ్రీను,
రచన, దర్శకత్వం: శామ్ జే చైతన్య

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X