సో...రొమాంటిక్ (కత్రినా ‘ఫితూర్’ మూవీ సాంగ్ వీడియో)
ముంబై: కత్రినా కైఫ్, ఆదిత్యరాయ్ కపూర్ జంటగా అభిషేక్ కపూర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫితూర్' మూవీ ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 12న విడుదల చేస్తున్నారు. ప్రేమికులకు సరిగ్గా రెండు రోజుల ముందు విడుదల చేయడం ద్వారా బిజినెస్ పరంగా కలిసొస్తుందని భావిస్తున్నారు.
ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ విడుదల చేయగా భారీ రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ విడుదలైన 24 గంటల లోపే మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ సాంగ్ ‘యే ఫితూర్ మేరా' వీడియో సాంగ్ యూట్యూబ్ ద్వారా విడుదల చేసారు. ఈ సాంగును ఎంతో రొమాంటిక్ గా తెరకెక్కించారు. యువతను ఆకట్టుకుంటోంది.
ఈ సినిమాలో టబు కూడా నటిస్తోంది. ఇందులో ఆమె పాత్ర విలక్షణంగా ఉండబోతోంది. సినిమాలో ఆమె పాత్ర పేరు బేగం. ఈ చిత్రాన్ని చార్లెడ్ డికెన్స్ రచించిన ‘గ్రేట్ ఎక్స్‌పెక్టేషన్స్' నవల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు అభిషేక్ కపూర్. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
హీరో ఆదిత్య రాయ్ కపూర్ సిక్స్ ప్యాక్ బాడీతో హరింత హాటుగా కనిపించబోతున్నాడు. అతనితో పోటీ పడేలా కత్రినాను కూడా సూపర్ హాట్ అండ్ సెక్సీగా ప్రజెంట్ చేసాడు దర్శకుడు. ఇక సినిమాలో రిమాంటిక్ సీన్లు ఎక్కువగా ఉంటాయనే ప్రచారం జరుగుతుండటం కూడా యువతలో సినిమాపై ఆసక్తి పెరిగేలా చేస్తున్నాయి.


Click it and Unblock the Notifications












