twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'సాహసం' కథకి స్ఫూర్తి అదే: యేలేటి చంద్రశేఖర్

    By Srikanya
    |

    హైదరాదాద్: చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వం వహించిన 'సాహసం' ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకున్నా మల్టిప్లెక్స్ లలో,ఎ సెంటర్లలలో కలెక్షన్స్ బాగుండటంతో చాలా కాలం తర్వాత గోపీచంద్ కి రిలీఫ్ వచ్చినట్లైంది. దర్శకుడు గా యేలేటి కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈ నేపధ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

    'సాహసం' కథకి స్ఫూర్తి గురించి చెప్తూ... మధ్య తరగతి జీవితాల్ని మనం నిత్యం చూస్తుంటాం. వాళ్లకొచ్చే చాలీచాలని జీతాలతో పడే ఇబ్బందులు నాకు బాగా తెలుసు. అలాంటి వాళ్లు ఒక్కసారిగా డబ్బులు వచ్చేయాలని.. వాటితో తమ కష్టాలు తీరిపోవాలని కలలు కంటారు. అలాంటివారికి తమ తాతల నాటి ఆస్తి ఉందని తెలిస్తే ఏం చేస్తారనే ఆలోచనే ఈ కథకు పునాది. దేశ విభజన సమయంలో చాలా మంది తమ ఆస్తుల్ని వదిలేసి దేశాలు మారారని చాలాసార్లు చదివాను. నేను అనుకున్న కథకి ఈ నేపథ్యాన్ని జోడిస్తే మరింత బాగుంటుందనిపించింది అన్నారు.

    గ్రాఫిక్స్‌కి ప్రాధాన్యమున్న చిత్రం యేలేటి చేయడం ఇదే తొలిసారి. ఆ విషయంలో అనుభవాలు చెప్తూ... కథ రీత్యా క్లైమాక్స్ సన్నివేశాల్లో గ్రాఫిక్స్‌ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడొస్తున్న చాలా సినిమాల్లో విజువల్‌ ఎఫెక్ట్స్‌ని విరివిగా ఉపయోగిస్తున్నారు. వీటన్నిటికీ భిన్నంగా సహజంగా ఉండేలా చూసుకున్నాం. నా వూహలకు అద్దం పట్టేలా ఆ సన్నివేశాల్ని రూపొందించాం. సాంకేతిక బృందం ఎంతో కష్టపడి పనిచేసింది అన్నారు.

    విలన్ పాత్రకు శక్తికపూర్‌ని ని ఎంచుకోవడానికి కారణం చెప్తూ... విలన్ పాత్ర కోసం చాలా మందిని అనుకున్నాం. చివరికి శక్తికపూర్‌ని తీసుకున్నాం. కథకు తీవ్రవాద నేపథ్యం ఉంది. నిజమైన ఓ తీవ్రవాది ఎలా ప్రవర్తిస్తాడు? అతని ఆలోచనలు ఎలా ఉంటాయ్‌? ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని శక్తికపూర్‌ పాత్ర డిజైన్‌ చేశాం. గౌతమ్‌ వర్మగా గోపీచంద్‌ సరిగ్గా సరిపోయాడు. మా ఇద్దరి కాంబినేషన్‌లో 'ఒక్కడున్నాడు' వచ్చింది. దర్శకుడిగా నాకు మంచి పేరు వచ్చింది. ఈసారి వాణిజ్య పరంగానూ మంచి విజయం దక్కాలనే ఉద్దేశంతో ఈ సినిమాకి కష్టపడి పనిచేశాం అన్నారు.

    గోపీచంద్ సరసన తాప్సీ హీరోయిన్. శక్తికపూర్, అలీతోపాటుగా ప్రముఖ తారాగణమంతా నటిస్తున్న ఈ సినిమాకు కెమెరా: శ్యామ్‌దత్ ఎస్, సంగీతం: శ్రీ, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఫైట్స్: సెల్వ, మాటలు: కె.కె.రాధాకృష్ణకుమార్, పాటలు: అనంత్‌శ్రీరామ్, సహ నిర్మాత: బోగవల్లి బాపినీడు, నిర్మాత: ఛత్రపతి ప్రసాద్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: చంద్రశేఖర్ ఏలేటి.

    English summary
    After a long gap, actor Gopichand and director Chandrasekhar Yeleti are back to rock the big screen with their latest Telugu movie Sahasam, which has hit the marquee across the globe. It is neither a brainy nor an intelligent film, but a commercial entertainer. It is a typical Gopichand film with Yeleti's touch.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X