అజిత్ మూవీ భారీ హిట్: తెలుగులోనూ వర్కౌట్ అవుద్దా?
హైదరాబాద్: తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన 'ఎన్నై అరిందాల్' ఈ రోజు తమిళనాడులో గ్రాండ్‌గా విడుదలైంది. గౌతం మీనన్ దర్శకత్వం వహించిన ఈచిత్రంలో అనుష్క, త్రిష హీరోయిన్లు. సంక్రాంతికే రావాల్సిన ఈ చిత్రం వాయిదా పడి ఇపుడు రిలీజైంది. ‘ఐ' సినిమాతో పోటీ పడటం ఇష్టం లేకనే సినిమాను వాయిదా వేసారి అప్పట్లో టాక్. కానీ ఈ సినిమా అపుడు విడుదలయి ఉంటే ‘ఐ' సినిమాకు భారీ నష్టం జరిగి ఉండేదని సినిమా చూసిన వారు అంటున్నారు. ఆ రేంజిలో ఉంది మరి ఈ సినిమా టాక్.
కానీ ఈ రోజు విడుదలైన ఈ చిత్రం భారీ హిట్ టాక్ సొంతం చేసుకుంది. గతంలో అజిత్ నటించిన సినిమాలు వరుసగా విజయాలు అందుకున్నాయి. ఈ నేపథ్యంలో చిత్రంపై ముందు నుండీ భారీ అంచనాలు ఉన్నాయి. అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా సినిమా ఉండటంతో అజిత్ ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఇక ఈ చిత్రాన్ని తెలుగులో "ఎంతవాడు కానీ.." అనే పేరుతో డబ్ అయి విడుదల చేయబోతున్నారు. ఆ మధ్య విడుదలైన ఈ సినిమా టీజర్ కి యూట్యూబ్‌లో మంచి రెస్పాన్స్ వచ్చింది. అప్పడే సినిమా హిట్ అవుతుందని అంచనాలు వేసారు. అంతా అనుకున్నట్లే జరిగింది. అజిత్ మూడు వైవిధ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో అనుష్క, త్రిషలు తమ అందచందాలతో ఆకట్టుకున్నారు.
ఆర్టిఫిషియల్ లుక్‌తో కనిపించకూడదనే ఉద్దేశంతో అజిత్ కుమార్ ఈ సినిమాలోనూ తెల్లజుట్టుతోనే కనిపించారు. ఇది పోలీస్ యాక్షన్ ఎంటర్టెనర్. అదే సమయంలో గౌతం మీనన్ చిత్రాల నుండి ఆశించే రొమాంటిక్ సీన్లు కూడా మెండుగానే ఉన్నాయట. తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ సీన్లు మంచి కిక్ ఇస్తాయని అంటున్నారు త్వలోనే తెలుగు రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు.


Click it and Unblock the Notifications











