»   » రంగస్థలం: ‘ఎంత సక్కగున్నావే’ సాంగ్ మేకింగ్ వీడియో

రంగస్థలం: ‘ఎంత సక్కగున్నావే’ సాంగ్ మేకింగ్ వీడియో

Posted By:
Subscribe to Filmibeat Telugu
Chiranjeevi Gifted Ram Charan A Expensive Gift

రామ్ చరణ్, సమంత జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'రంగస్థలం'. మార్చి 30న విడుదలవుతున్న ఈ చిత్రం ప్రమోషన్లు జోరుగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సమంత, రామ్ చరణ్ మీద చిత్రీకరించిన 'ఎంత సక్కగున్నావే' సాంగ్ మేకింగ్ వీడియో విడుదల చేశారు.

ఈ పాటను చిత్రీకరించడానికి ఎండలో చిత్ర యూనిట్ ఎంత కష్టపడిందో ఈ మేకింగ్ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. లైఫ్‌లో మన మనసుకు నచ్చిన పాటలు మాత్రమే ప్రేమతో చేస్తాం, నేను చేసిన అలాంటి పాటల్లో ఇదీ ఒకటి అని శేఖర్ మాస్టర్ తెలిపారు. ఎంత సక్కగున్నావే లచ్చిమి అనే పాట శ్రమైక జీవన సౌందర్యంతో కూడిన కవితాత్మకమైన పాట... అని లిరిసిస్ట్ చంద్రబోస్ తెలిపారు.

ఈ చిత్రంలో పల్లెటూరి అమ్మాయి రామలక్ష్మి పాత్రలో సమంత ఎంతో అందంగా కనిపించబోతోంది. ముఖ్యంగా ఈ రోల్‌లో ఆమె ప్రదర్శించిన ఎక్స్‌ప్రెషన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. సమంత కెరీర్లో రామలక్ష్మి పాత్ర వన్ ఆఫ్ ది బెస్ట్ రోల్ అవుతుందని భావిస్తున్నారు.

ఎంత సక్కగున్నావే పాటకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చడంతో పాటు ఆయనే స్వయంగా పాడారు. ప్రముఖ లిరిక్ రైటర్ చంద్రబోస్ అందించిన సాహిత్యం ఆ పాటకు మరింత వన్నెతెచ్చింది.

English summary
Yentha Sakkagunnaave Song Making from Rangasthalam Telugu Movie on Mythri Movie Makers. #Rangasthalam 2018 Telugu Movie ft. Ram Charan, Samantha and Aadhi Pinisetty. #Rangasthalam is Directed by Sukumar and Music composed by DSP / Devi Sri Prasad. Produced by Naveen Yerneni, Y Ravi Shankar and Mohan Cherukuri under Mythri Movie Makers banner.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X