»   » సమంత ఎంత సక్కగుందో.... (రంగస్థలం సాంగ్ వీడియో టీజర్)

సమంత ఎంత సక్కగుందో.... (రంగస్థలం సాంగ్ వీడియో టీజర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Yentha Sakkagunnave Video Song Teaser : Rangasthalam Songs

రామ్ చరణ్, సమంత జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'రంగస్థలం'. మార్చి 30న విడుదలవుతున్న ఈ చిత్రం ప్రమోషన్లు జోరుగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సమంత, రామ్ చరణ్ మీద చిత్రీకరించిన 'ఎంత సక్కగున్నావే' వీడియో సాంగ్ ప్రోమో విడుదల చేశారు.

పల్లెటూరి అమ్మాయి రామలక్ష్మి పాత్రలో సమంత ఎంతో అందంగా కనిపించబోతోంది. ముఖ్యంగా ఈ రోల్‌లో ఆమె ప్రదర్శించిన ఎక్స్‌ప్రెషన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. సమంత కెరీర్లో రామలక్ష్మి పాత్ర వన్ ఆఫ్ ది బెస్ట్ రోల్ అవుతుందని భావిస్తున్నారు.

ఎంత సక్కగున్నావే పాటకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చడంతో పాటు ఆయనే స్వయంగా పాడారు. ప్రముఖ లిరిక్ రైటర్ చంద్రబోస్ అందించిన సాహిత్యం ఆ పాటకు మరింత వన్నెతెచ్చింది. సాంగ్ ప్రోమో చూసిన ఫ్యాన్స్ సమంత ఎంతో సక్కగుంది అంటూ కామెంట్స్ ప్రశంసిస్తున్నారు.

'రంగస్థలం' అనే విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. జగపతి బాబు, ఆది పినిశెట్టి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని మార్చి 30న అత్యధిక థియేటర్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

English summary
"Yentha Sakkagunnave Video Teaser" from New Telugu Movie Rangasthalam starring Ram Charan, Samantha, Aadhi Pinisetty, Prakash Raj, Jagapathi Babu, Anasuya Bharadwaj. A Rockstar Devi Sri Prasad Musical.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X