»   » అజిత్ మూవీకి గోపీచంద్ ఆడియో ఆవిష్కరణ (ఫోటోస్)

అజిత్ మూవీకి గోపీచంద్ ఆడియో ఆవిష్కరణ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తమిళ స్టార్ అజిత్ హీరోగా ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవమీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం 'ఎన్నై అరిందాల్'. అనుష్క, త్రిష హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం తమిళంలో సూపర్ డూపర్ హిట్ అయింది. ఇదే ఈ చిత్రాన్ని తెలుగులో 'ఎంతవాడుకానీ' అనే టైటిల్ అనువదించి విడుదల చేస్తున్నారు ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం. సంగీత దర్శకుడు హారీస్ జైరాజ్ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం గురువారం హైదరాబాద్ లోని దసపల్లా హోటల్లో జరిగింది. ఈ ఆడియో వేడుకకు హీరో గోపీచంద్, డైరెక్టర్ సురేందర్ రెడ్డి, నిర్మాతలు అనిల్ సుంకర, బిఏ రాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా గోపీచంద్ మాట్లాడుతూ - ''నాన్నగారు రూపొందించిన చాలా చిత్రాలకు రత్నంగారు వర్క్ చేసారు. అప్పట్నుంచే ఆయనతో నేను సన్నిహితంగా ఉండేవాడిని. కమలహాసన్, రజనీకాంత్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించి హిట్స్ సాధించారు. అజిత్ తో రెండు సినిమాలు చేసారు. రెండూ పెద్ద హిట్ అయ్యాయి. మూడో సినిమా కూడా ప్లాన్ చేస్తున్నారు. ఆ సినిమా పెద్ద హిట్టవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.


నిర్మాత రత్నం మాట్లాడుతూ - ''కథకు సరిపడా టైటిల్ పెట్టమని అజిత్ చెప్పారు. హీరో గురించి ఆలోచించి టైటిల్ పెట్టొద్దు అని చెప్పారు. అందుకే తమిళంలో 'ఎన్నయ్ అరిందాల్' అని టైటిల్ పెట్టడం జరిగింది. తెలుగులో 'ఎంతవాడుకానీ' టైటిల్ ని పెట్టాము.అజిత్ తో నాది ఇప్పటి పరిచయం కాదు. తను హీరోగా నటించిన 'ప్రేమలేఖ' చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించాను. అది మంచి విజయం సాధించింది.'' అని అన్నారు. స్లైడ్ షోలో ఫోటోలు..


సీడీ ఆవిష్కరణ

సీడీ ఆవిష్కరణ

ఎంతవాడు కానీ సీడీ శిష్కరణలో పాల్గొన్న గోపీచంద్, సురేందర్ రెడ్డి, అనిల్ సుంకర, బిఏ రాజు, ఎఎం రత్నం.


ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది

ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది

తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్నట్లే తెలుగు ప్రేక్షకులను కూడా ‘ఎంతగాడు గానీ' చిత్రం ఆకట్టుకుంటుంది, త్వరలో సినిమా విడుదల తేదీ ప్రకటిస్తామని తెలిపారు.


నటీనటులు

నటీనటులు

అజిత్‌కుమార్‌, అరుణ్‌ విజయ్‌, త్రిష, అనుష్క, వివేక్‌, అనిక సురేంద్రన్‌, సుమన్‌, ఆశిష్‌ విద్యార్థి, అవినాష్‌, పార్వతీనాయర్‌, నాజర్‌, డానియేల్‌ బాలాజీ తదితరులు నటించారు.


సాంకేతిక నిపుణులు

సాంకేతిక నిపుణులు

ఈ చిత్రానికి మాటలు: ఘంటసాల రత్నకుమార్‌, కెమెరా: డాన్‌ మకర్తూర్‌, సంగీతం: హరీస్‌ జయరాజ్‌, ఎడిటింగ్‌: ఆంథోనీ, ఆర్ట్‌: రాజీవన్‌, పాటలు: ఎ.ఎం.రత్నం, శివగణేష్‌, స్టంట్స్‌: సిల్వ, డాన్స్‌: బృందా, సతీష్‌, అసోసియేట్‌ ప్రొడ్యూసర్‌: ఎ.రఘురామ్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎ.ఎం.జోతికృష్ణ, నిర్మాత: ఎస్‌.ఐశ్వర్య, దర్శకత్వం: గౌతమ్‌ వాసుదేవ్‌మీనన్‌.


English summary
Yenthavadu Gaani movie audio launch held at Dasapalla Hotel in Hyderabad on Thursday (23rd April) evening.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu