»   » ‘అత్తారింటికి దారేది’ పైరసీ వెనక అసలు నిజాలతో...

‘అత్తారింటికి దారేది’ పైరసీ వెనక అసలు నిజాలతో...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అత్తారింటికి దారేది' విడుదలకు ముందే బయటకు లీక్ అయి అందరినీ షాక్ కు గురి చేసింది. ఈ పరిణామాలతో ఖంగుతిన్న నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ ఉన్నపళంగా సినిమాను రిలీజ్ చేసారు.

Yerupu movie on Attharintiki Daaredhi pre-release piracy

ఇపుడు ఈ అత్తారింటికి దారేది పైరసీ వ్యవహారంపై సినిమా రాబోతోంది. ఈ వ్యవహారం ఎలా జరిగింది, పోలీసులు వారిని ఎలా పట్టుకున్నారు అనే విషయాలను దర్శకుడు తెరపై చూపించబోతున్నాడు.
‘ఓయ్' సినిమా దర్శకుడు ఆనంద్ రంగ, శేషారెడ్డి నిర్మాతలుగా రూపొందుతున్న ఈ సినిమాకు 'ఎరుపు' అనే టైటిల్ ఫిక్స్ చేసారు. వెంకట్ కృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.


తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ కూడా విడుదైంది. పవన్ కళ్యాణ్ అభిమానులే టార్గెట్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తక్కువ బడ్జెట్ లో సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చితం టీజర్ మీద మీరూ ఓ లుక్కేయండి.


English summary
A story in the backdrop of Attharintiki Daaredhi pre-release piracy.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu