నేను అసలు అక్కడి దాన్నే..అక్కినేని అమల
నేను అస్సలు బెంగాళ్ ప్రాంతానికి చెందిన దాన్నే కానీ చాలా మందికి ఆ విషయం తెలియదు అంటోంది అక్కినేని అమల. నాగార్జునని వివాహం చేసుకున్న అక్కినేని అమల అసలు పేరు అమల ముఖర్జీ. ఆమె వెస్ట్ బెంగాళ్ లో పుట్టింది. ఆమె తండ్రి బెంగాళి..తల్లి ఐరిష్. కానీ వారి కుటుంబం చిన్నప్పుడే చెన్నై కి షిప్ట్ అవటంతో ఆమె బాల్యం,కెరీర్ అక్కడే గడిచింది. ఈ విషయం ఆమె మాట్లాడుతూ నేను పుట్టుకతో బెంగాళీనే కానీ..బెంగాళీ మాట్లాడలేదు. తమిళం, తెలుగు చాలా బాగా మాట్లాడగలను. అయితే బెంగాళి అర్దం అవుతుంది. మా నాన్న వల్ల నాకు అర్దం చేసుకునే దాకా వచ్చింది అంటూ చెప్పుకొచ్చింది. నేను తెలుగు నటుడ్ని వివాహం చేసుకోవటంతో తెలుగు బాగా వచ్చింది అంది చివరగా.


Click it and Unblock the Notifications











