త్రిషపై రూమర్ నిజమే
త్రిషపై రీసెంట్ గా వివాహానికి సంభందించి కంటిన్యూగా రూమర్స్ వస్తూనే ఉన్నాయి.అయితే అంతే స్పీడుగా ఆమె ఖండిస్తూ వస్తోంది. తాజాగా ఆమె చెన్నైకి చెందిన అమృత్ అనే పారిశ్రామిక వేత్తను వివాహం చేసుకోబోతోందని గుప్పుమంది. ఈ విషయమై క్లారిటీ ఇస్తూ.. అమృత్ చెన్నైకి చెందిన వాడు. నాకు ఓ నెల క్రితం పరిచయం. ఓ కామన్ ప్రెండ్ నాకు పరిచయం చేసారు. అప్పటినుంచి మా గ్యాంగ్ లో అతనూ మెంబరయ్యాడు. మా ప్రెండ్స్ మి అంతా ఆదివారాలు కలిసి పార్టీలు చేసుకుంటాం. అలా అతనూ అక్కడికి అటెండవుతూంటాడు. ఇక మా అమ్మ పెళ్లి సంభందాలు చూస్తోందని, అందులో అమృత్ ఒకడనేది మాత్రం ఈ విషయాన్ని చూసి అల్లిన కట్టు కధే. అలాగని నేను వివాహం చేసుకోను అని చెప్పను. ఆ సమయం రానే వచ్చింది. నాకు తగ్గ మిస్టర్ రైట్ నాకు దొరుకుతాడు.తప్పని సరిగా అప్పుడు మీడియావారికి పిలిచి చెపుతాను అని తేల్చి చెప్పింది.


Click it and Unblock the Notifications











