‘రా.వన్’పై రజనీ కామెంట్స్
బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ నటిస్తున్న రావన్ సినిమాలో రజనీకాంత్ అతిథి పాత్ర చేస్తున్నాడని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. షారుఖ్ కూడా ఈ విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు కూడా. అయితే ఆ తర్వాత ఈ వార్తలన్నీ అవాస్తవమనే ప్రచారం కూడా జరిగింది. అయితే దీనిపై ఎట్టకేలకు స్వయంగా క్లారిటీ ఇచ్చారు రజనీ. బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమల వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ రా.వన్ లో అతిథి పాత్రలో నటించానని స్పష్టం చేశారు. మరో మూడు నెలల్లో కొత్త సినిమా రాణా చేస్తానని వెల్లడించారు.
రాణా షూటింగ్ ప్రారంభం రోజే రజనీ అనారోగ్యం పాలవడంతో కొంత కాలంగా ఆయన ఆసుపత్రికే పరిమితం అవడం, విదేశాల్లో చికిత్స అనంతరం ఇటీవల భారత్ తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పడు ఆయన ఆరోగ్యం పూర్తిగా కుదుట పడటంతో రజనీ శ్రీవారికి మొక్కు తీర్చుకునేందుకు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల వచ్చారు. ఆయనతో పాటు అల్లుడు ధనుష్, కూతురు ఐశ్వర్య తదితరులు వచ్చారు.


Click it and Unblock the Notifications











