twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నిజమే...కె.విశ్వనాథ్‌ సినిమా చేయనన్నాను: శృతి హాసన్

    By Srikanya
    |

    నిజమే. నేను కె.విశ్వనాథ్‌ సినిమాలో అవకాశం వస్తే చేయనన్నారు.దానికి కారణం మరేదో కాదు.ఆ సమయంలో కాల్షీట్లు సర్దుబాటు చేయలేకపోవటమేనంటూ చెప్పుకొచ్చింది శృతి హాసన్.అల్లరి నరేష్ తో కె విశ్వనాధ్ రూపొందించిన శుభప్రదం చిత్రంలో ఆమెను అడిగారు.అయితే ఆమె చేయలేదు. ఈ విషయమై ఆమె మీడియాతో మాట్లాడుతూ...ఆయన సినిమా కాదనటానికి పెద్ద కారణం లేదు. విశ్వనాథ్‌గారంటే నాకు చాలా గౌరవం. ఆయన డాడీతో చేసిన చిత్రాలన్నీ చూశాను అంది. అయితే అల్లరి నరేష్ ప్రక్కన చేయకూడదనే ఆమె ఆ సినిమా ఒప్పుకోలదేనేది బయిట టాక్.ఇక ఆమె సిద్దార్ధ సరసన నటించిన 'అనగనగా ఓ ధీరుడు' చిత్రం ఈ నెల 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అందులో ఆమె యువరాణి లా కనిపించనుంది. ఆ పాత్ర గురించి చెబుతూ...యువరాణిలా కనిపించడానికి చాలా కష్టపడాల్సొచ్చింది. మేకప్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకొన్నా. ఢిల్లీ నుంచి నా కోసం ప్రత్యేకంగా మేకప్‌ నిపుణురాలిని తీసుకొచ్చారు. ఈ సినిమాలో నా పేరు ప్రియ. చెప్పలేనంత ఉత్సాహం.. కాస్త ఉత్కంఠ మిళితమైన పాత్ర నాది అంది. ఈ సినిమాతో ఆమెతెలుగులో సెటిల్ అవ్వాలని కోరుకుందాం.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X