చిత్రాలు: అలనాటి మాస్ మసాలా గర్ల్స్
హైదరాబాద్: శృంగారం సినిమాకు కాసుల వర్షం కురిపిస్తుందనేది కొత్త మాటేమీ కాదు. స్త్రీల అందాల ఆరబోతతో వెండి తెరను వేడెక్కించి, ప్రేక్షకులకు వేడెక్కించి, లాభాలు ఆర్జించాలనే యావ చిత్రసీమలో మొదటి నుంచీ ఉంది. అలాంటి తారలు తెలుగు సినీ పరిశ్రమను ఏలిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒక్క నృత్యం ఉంటే చాలు, సిల్క్ స్మిత ప్రేక్షకులను ఉర్రూతలూగించేంది.

జ్యోతిలక్ష్మి కన్నుగీటితే...
జ్యోతిలక్ష్మి అలనాటి సినిమాల్లో అందాలు ఆరబోస్తూ నృత్యం చేస్తే గుండెలు పారేసుకుని యువకులు లేరంటే అతిశయోక్తి కాదు. అయితే, ఆమె కొన్ని సినిమాల్లో కూడా నటించింది కూడా. గన్ పట్టి ప్రత్యర్థుల్లో గుండెల్లో గుబులు రేపే పాత్రలు కూడా చేసింది. ఆమె కన్ను గీటిన దృశ్యాన్ని తెర మొత్తం మీద చూపించిన సినిమాలు కూడా ఉన్నాయి.

జయమాలిన చీరకట్టులోనూ ఆరబోత
జయమాలిని ప్రత్యేకత ఆమె వక్ష సంపద. చీరకట్టులోనూ ఆమె శృంగార రసాన్ని పండించేది. ఆమె నృత్యం చేస్తుంటే శృంగారం జల్లుజల్లు మాదిరిగా కురిసినట్లుండేది. కొన్ని చిత్రాల్లో ఆమె నటనకు అవకాశం ఉన్న పాత్రల్లో కూడా నటించింది.

హెలెన్ తెలుగులో కూడా..
ఒకప్పుడు హిందీ చిత్రసీమను తన శృంగార నాట్యాలతో ఉర్రూతలూగించిన హెలెన్ కొన్ని తెలుగు సినిమాల్లో ప్రేక్షకులకు కనువిందు చేసింది. అప్పట్లో హెలెన్ హిందీ సినిమాలకో ఓ అసెట్.

సిల్క్ స్మిత చూపులే మత్తెక్కించేవి...
సిల్క్ స్మిత గురించి చెప్పనే అవసరం లేదు. ఆమె అందాలకు ఎంత మంది గుండెలు పారేసుకున్నారో తెలియదు. బావలు సయ్యా అంటే ఆమె అందాలను కళ్ల నిండా జుర్రుకోవడానికి ప్రయత్నంచని ప్రేక్షకుడు లేడు. వసంతకోకిల, సీతాకోకచిలుక వంటి చిత్రాల్లో ఆమె నటనకు అవకాశం ఉన్న పాత్రలు కూడా చేసింది. నిజానికి, సిల్క్ స్మిత చూపులే మత్తెక్కిస్తాయి.
జ్యోతిలక్ష్మి తెర మీద కన్నుగీటితే యువకుల గుండెలు అదిరిపడేవి. ఆ తర్వాత జయమాలిని చీరకట్టులోనూ అందాల గంధాలు పూస్తుంటే తెలుగు ప్రేక్షకుడు బ్రహ్మరథం పట్టారు. ఎప్పటికప్పుడు అటువంటి అందాల మెరుపు తారలను సినీ పరిశ్రమ వెతుకుతూనే ఉంది. అనురాధ వంటి కాబరే డ్యాన్సర్లు కూడా ప్రేక్షకులను మత్తెక్కించారు. గతంలో వారిని క్యాబరే డ్యాన్సర్లు అనేవారు ఇప్పుడు ఐటమ్ గర్ల్స్ అంటున్నారు.


Click it and Unblock the Notifications











