twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దేవదాసు గాయని ఇక లేరు.. ఆ విషాద పాట ఇప్పటికీ!

    |

    ప్రముఖ గాయని కె రాణి(75) శుక్రవారం రాత్రి తుది శ్వాస విడిచారు. దేవదాసు చిత్రంలో 'అంతా భ్రాంతియేనా' అనే విషాదకర పాటతో రాణి పాపులర్ అయ్యారు. ఆ పాట ఇప్పటికి సంగీత ప్రియులని అలరిస్తూనే ఉంటుంది. అన్ని భాషల్లో ఆమె 500 పైగా పాటలు పాడారు. కాగా హైదరాబాద్ లోని కళ్యాణి నగర్ లో నివాసం ఉంటున్న కళ్యాణి శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు.

    ఈ విషయాన్ని ఆమె కుమార్తెలు ధృవీకరించారు. అనారోగ్యంతో రాణి మృతిచెందినట్లు తెలుస్తోంది. 1950, 60 దశకాలాల్లో రాణి అత్యధిక తెలుగు, తమిళ చిత్రాల్లో పాటలు పాడారు. మాజీ భారత రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ సమక్షంలో కూడా ఆమె పాటలు పాడి మైమరపించారు.

    Yesteryear singer K Rani passess away

    శ్రీలంక జాతీయ గీతాన్ని ఆలపించే అవకాశం కూడా రాణికి దక్కింది. దేవదాసు, చంద్రహారం, చిరంజీవులు, భలే రాముడు వంటి తెలుగు చిత్రాల్లో ఆమె తన గాత్రంతో మెప్పించారు.

    English summary
    Yesteryear singer K Rani passess away. She became popular with Devadasu movie
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X