‘ఎటో వెళ్లిపోయింది మనసు’ ఆడియో ట్రాక్ లిస్టు

By Bojja Kumar

హైదరాబాద్: చిన్ననాటి స్నేహం ఎంతో మధురమైంది. వయసుతోపాటు ఇద్దరి వ్యక్తుల మధ్య ఆ స్నేహం ఎలాంటి ఆటుపోట్లకు గురైంది, మార్పులకు లోనైంది.. అన్న పాయింట్‌తో వస్తున్న చిత్రం 'ఎటో వెళ్లిపోయింది మనసు'. గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నాని, సమంత హీరోహీరోయిన్లు. సి.కళ్యాణ్‌ నిర్మాత కాగా, అలనాటి నటి చంద్రకళ కుమార్తె రేష్మ సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈచిత్రం ఆడియో సెప్టెంబర్ 2న విడుదల కాబోతోంది.

తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోన్న ఈ చిత్రం తెలుగు వెర్షన్‌లో హీరోగా నాని నటిస్తుండగా... తమిళ, హిందీ వెర్షన్లలో హీరోలుగా జీవా, ఆదిత్యరాయ్ కపూర్ నటిస్తున్నారు. ఈ మూడు భాషల్లోనూ సమంతానే కథానాయిక కావడం విశేషం. అంటే... ఈ సినిమా ద్వారా సమంత బాలీవుడ్‌కి పరిచయం కానున్నారన్నమాట. ఈ ప్రేమ కథకు ఇళయరాజా సంగీతాన్ని అందించడం మరో విశేషం.

ఈ చిత్రంలో మొత్తం 8 పాటలున్నాయి. ఆ వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.

1. కోఠి కోఠి
గానం: కార్తీక్

2. నచ్చలేదు మామా
గానం: సూరజ్ జగన్, కార్తీక్

3. ఎంతెంత దూరం
గానం: కార్తీక్

4. ఏది ఏది
గానం: షాన్, రమ్య ఎన్ఎస్‌కె

5. అర్థమైంది ఇంతే ఇంతేనా
గానం: యువన్ శంకర్ రాజా

6. అటు ఇటు
గానం: సునిధి చౌహాన్

7. ఇంత కాలం
గానం: రమ్య ఎన్ఎస్‌కె

8. లాయి లాయి
గానం: ఇళయారాజా, బాలా షిండే

కృష్ణుడు, విద్యు, అనుపమ, శ్వేత తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: కోన వెంకట్‌, కెమెరా: ఎం.ఎస్‌.ప్రభు, ఓంప్రకాష్‌, సంగీతం: ఇళయరాజా, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గౌతమ్‌ వాసుదేవ్‌మీనన్‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X