సమంత' ఎటో వెళ్ళి పోయింది మనస్సు 'స్టోరీ లైన్

By Srikanya

నాని, సమంత జంటగా గౌతమ్‌ వాసుదేవమీనన్ దర్శకత్వంలో తేజ సినిమా ప్రొడక్షన్స్ పతాకంపై సి.కళ్యాణ్ నిర్మిస్తున్న చిత్రం 'ఎటో వెళ్లిపోయింది మనసు'. ఈ సినిమాలో సమంత, నాని ఆరేళ్ల వయసులో కలుస్తారు. తర్వాత పదిహేనేళ్ల వయసులో కలుస్తారు. 20, 25ఏళ్ల వయసులోనూ కలుస్తారు. ఇలా ప్రతి ఏజ్‌లోనూ వాళ్ళలో వచ్చిన మార్పులు, భావోద్వేగాలు, అనుభూతులే ఈ సినిమా. నాని,సమంతలు సైతం ఈ చిత్రంపై మంచి హోప్స్ పెట్టుకున్నారు. సమంత ఈ చిత్రంలో తనకు డిఫెరెంట్ పాత్ర అని...టీనేజ్ అమ్మాయిగా,పెళ్లైన యువతిగా డిఫెరెంట్ గా ఒకే పాత్రలో కనిపిస్తున్నాని చెప్తోంది.

ఈ చిత్రం నాలుగు పాటలు మినహా షూటింగ్ పూర్తయ్యింది. సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రచార చిత్రాలు విడుదల చేసారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ ''చిన్నప్పటి నుంచీ ఇళయరాజా సంగీతం అంటే పిచ్చి. నా ఫోన్‌లో కూడా ఆయన పాటలే ఉంటాయి. నేను సహాయ దర్శకుణ్ని కావడానికి స్ఫూర్తినిచ్చిన దర్శకుల్లో గౌతమ్‌మీనన్‌ ఒకరు. వీరిద్దరితో సినిమా చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ఈ కథ విన్నప్పుడు నా ప్రేమ కథే అనిపించింది. మనసు ఎటో వెళ్లిపోయింది. ప్రేక్షకులకీ అలాంటి భావనే కలుగుతుంది''అన్నారు.

గౌతమ్‌మీనన్ మాట్లాడుతూ -''తెలుగులో నాకు మూడవ స్ట్రయిట్ ఫిలిం ఇది. 'ఏ మాయ చేశావె'తో పోలిస్తే సమంతలో చాలా వైవిధ్యం కనిపించింది. అద్భుతమైన నటి ఆమెలో ఆవిష్కృతం అయ్యింది. నాని చాలా బాగా చేశాడు. కెమెరా ముందుకొస్తే ఎంతో లవ్లీగా కనిపించాడు తను. వరుసగా నానీతో సినిమాలు చేయాలనిపించింది. తొలుత ఈ సినిమాకి రహమాన్‌నే మ్యూజిక్ డెరైక్టర్‌గా అనుకున్నాం. తనకు ఖాళీ లేకపోవడంతో ఇళయరాజాని పెట్టాం. అద్భుతమైన సంగీతాన్నందించారాయన. నేను చేసిన సినిమాల్లో నా ఫేవరెట్ మూవీ ఇది'' అన్నారు.

ఈ సమావేశంలో సి.కళ్యాణ్‌మాట్లాడుతూ -''ఈ సినిమా తీయడం గర్వంగా, ఆనందంగా ఉంది. 12 ఏళ్ల క్రితం గౌతమ్‌వాసుదేవమీనన్ తొలి చిత్రం 'చెలి'ని నేనే విడుదల చేశాను. మళ్లీ గౌతమ్ సినిమా విడుదల చేయడం ఆనందంగా ఉంది.
ఈ సినిమా ఎలా ఉంటుందో స్టిల్స్, టీజర్స్‌ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే తొమ్మిది లక్షలమంది ఈ టీజర్స్‌ని వీక్షించారు. దీన్నిబట్టి ఈ సినిమా క్రేజ్‌ని అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి ఈ సినిమాని ఎప్పుడో రిలీజ్ చేద్దామనుకున్నాం. కానీ గౌతమ్ 'పిల్లలు ఎగామ్స్ బాగా రాయాలి. కాలేజీలు తెరవాలి. ఆ ఉత్సాహంలో ఈ సినిమా చూడాలి' అన్నారు. అందుకే ఈ సినిమా షూటింగ్‌ని స్లోగా చేయడం జరిగింది. పాటలన్నీ లండన్‌లో రికార్డ్ చేశాం. 'చందమామ' తర్వాత నిర్మాతగా నాకు అంతకు మించి పేరు తెచ్చిపెట్టే చిత్రం ఇది'' అని చెప్పారు.

ఇళయరాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో రెండు బిట్ సాంగ్స్ తో కలిపి తొమ్మిది పాటలు ఉన్నట్లు తెలుస్తోంది. అనంత శ్రీరాం ఈ పాటలనన్నిటినీ సింగిల్ కార్డుతో రాసారు. ఈ చిత్రం ప్రోమో ఇప్పటికే రిలీజయ్య ఇళయారాజా అభిమానుల్లో ఆసక్తిని రేపింది. గ్యారెంటీగా మ్యూజికల్ హిట్ అవుతుందని భావిస్తున్నారు.ఇక ఎటో వెళ్లి పోయింది టైటిల్.. గతంలో కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన నిన్నా పెళ్ళాడతా చిత్రంలో హిట్టైన సాంగ్ లోది. తమిళంలో హీరోగా జీవా నటిస్తున్నారు. హిందీలో ఆదిత్యా రాయ్ కపూర్ చేస్తూండగా నాని తెలుగులో చేస్తున్నారు. మొదట రామ్ ని తెలుగుకు అనుకున్నారు కానీ అభిప్రాయ భేధాలతో రామ్ ఆ ప్రాజెక్టు నుంచి బయిటకు వచ్చేసారు. సమంత మాత్రం ఈ భాషల్లోనూ హీరోయిన్ గా చేస్తోంది. ఇది ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ అని దర్సకుడు చెప్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X