సమంత 'ఎటో వెళ్ళి పోయింది మనస్సు' లేటెస్ట్ ఇన్పో
ఏమి మాయచేసావే చిత్రంలో తనకంటూ తెలుగులోనూ క్రేజ్ తెచ్చుకున్న దర్శకుడు గౌతమ్ మీనన్. ఆయన తన తాజా చిత్రం 'ఎటో వెళ్ళి పోయింది మనస్సు'లో సమంత హీరోయిన్ గా చేస్తోన్న సంగతి తెలిసిందే. ప్రేమ కథా చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని తెలుగుకు సి.కల్యాణ్ నిర్మాత. చిత్రం టాకీ భాగం పూర్తయింది. త్వరలోనే విదేశాల్లో పాటల్ని తెరకెక్కిస్తారు. ఇప్పటికే ఈ చిత్రంపై ఇప్పటికే విపరీతమైన అంచనాలు పెగిగాయి. నాని ఈ చిత్రంలో హీరోగా చేస్తున్నారు.
నాని ఈ చిత్రం గురించి మాట్లాడుతూ...నిన్న ఒకరినొకరు చూసుకొన్న వెంటనే ఐ లవ్ యూ అని చెప్పుకోలేదు. ఆరేళ్ల వయసు నుంచీ ఆ ఇద్దరికీ అనుబంధముంది. ఒకే చోట ఆడుకొన్నారు. ఒకరినొకరు కొట్టుకొన్నారు. ఎదుటి మనసును అలవోకగా ఆకర్షించే టీనేజ్‌ను కూడా దాటేశారు. కానీ వారిలో ఎప్పుడూ ప్రేమ భావన కలగలేదు. ఇరవయ్యేడేళ్లొచ్చాక మాత్రం వారి మనసుల్లో ఏదో అలజడి. ఆ కథేమిటో తెలియాలంటే మా చిత్రం చూడాల్సిందే అంటున్నారు నాని.
గౌతమ్‌మీనన్ మాట్లాడుతూ ''ప్రేమ ఎప్పుడు ఎలా పుడుతుందో ఎవ్వరికీ తెలియదు. వివిధ వయసుల్లో కలుసుకొన్న ఓ జంట మధ్య ప్రేమ పుట్టిన సందర్భం ఎలాంటిదనే విషయాన్ని అందంగా ఆవిష్కరిస్తున్నాం. అదుపు తప్పిన మనసుల కోసం వారు అన్వేషించిన తీరు తియ్యటి అనుభూతుల్ని పంచుతుంది. వినోదం, భావోద్వేగాలకు ప్రాధాన్యమున్న కథాంశమిది. ప్రతి ఒక్కరూ తెరపై తమను తాము చూసుకొనేలా ఉంటుంది''అన్నారు.
సమంత ఈ చిత్రంలో తనకు డిఫెరెంట్ పాత్ర అని...టీనేజ్ అమ్మాయిగా,పెళ్లైన యువతిగా డిఫెరెంట్ గా ఒకే పాత్రలో కనిపిస్తున్నాని చెప్తోంది. ఇళయరాజా స్వరాలు చిత్రానికి బలాన్నిస్తాయి. త్వరలోనే విదేశాల్లో పాటల్ని చిత్రీకరిస్తాము అన్నారు నిర్మాత. కృష్ణుడు, విద్యు, అనుపమ, రవి రాఘవేంద్ర, శ్రీరంజని, శ్వేత, ప్రీతి తదితరులు ఇతర పాత్రధారులు. మాటలు: కోన వెంకట్, ఛాయాగ్రహణం: ఎం.ఎస్.ప్రభు, ఓం ప్రకాష్, సంగీతం: ఇళయరాజా.


Click it and Unblock the Notifications











