‘ఎటో వెళ్లి పోయింది మనసు’లో 22 నిమిషాలు కీలకం

By Bojja Kumar

హైదరాబాద్: ప్రేమ కథా చిత్రాలు తీయడంలో దర్శకుడు గౌతం మీనన్ తనదైన శైలిని అనుసరిస్తూ ఉంటాడు. ఆయన సినిమాలు అటు ఎంటర్ టైన్మెంట్ తో పాటు... హార్ట్ టచ్చింగ్ గా ఉంటాయి కాబట్టే ఆయన సినిమాలంటే యూత్ లో మంచి క్రేజ్ ఏర్పడటానికి కారణం అయింది.

గతంలో గతం మీనన్ దర్శకత్వంలో వచ్చిన 'చెలి', 'ఏ మాయ చేసావె' చిత్రాలు రెగ్యులర్ ప్రేమ కథా చిత్రాలే అయినా.... విభిన్నమైన ఆకట్టుకునే స్క్రీన్ ప్లేతో పాటు, డిఫరెంట్ క్లైమాక్స్ ఉండటం వల్లనే మంచి విజయం సాధించడం జరిగింది. ఇప్పుడు తన తాజా సినిమా 'ఎటో వెళ్లి పోయింది మనసు' చిత్రం విషయంలో కూడా గౌతం మీనన్ అదే ఫాలో అవుతున్నాడు.

నాని-సమంత జంటగా నటిస్తున్న 'ఎటో వెళ్లి పోయింది' మనసు చిత్రంలో 22 నిమిషాల పాటు క్లైమాక్స్ సీన్ ఉంటుంది. ఈ పార్ట్ ప్రేక్షకులను ఎమోషనల్ గా అరెస్టు చేసే విధంగా ఉంటుందని అంటున్నారు. మరోసారి తన మార్కుతో ప్రేక్షకులను కట్టిపడేయడంలో గౌతం మీనన్ సఫలం అయితే ఈ చిత్రం పెద్ద హిట్టే.

ఈ చిత్రం డిసెంబర్ 14న విడుదలకు సిద్ధం అవుతోంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోన్న ఈ చిత్రం తెలుగు వెర్షన్‌లో హీరోగా నాని నటిస్తుండగా... తమిళ, హిందీ వెర్షన్లలో హీరోలుగా జీవా, ఆదిత్యరాయ్ కపూర్ నటిస్తున్నారు. ఈ మూడు భాషల్లోనూ సమంతానే కథానాయిక కావడం విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X