నా ఫ్రెండ్స్ కూడా ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ మూవీ స్లోగా ఉందన్నారు : నాని
హైదరాబాద్ : 'నేను నటించిన 'ఎటో వెళ్లి పోయింది మనసు' చిత్రం రిలీజ్ రోజు చూసిన నా మిత్రులంతా సినిమా స్లోగా ఉందని చెప్పారు. కానీ అలా అన్న వారే ఆ సినిమాను ఇప్పటికి నాలుగైదు సార్లు చూసారు. నేను ఇప్పటి వరకు చేసిన సినిమాలకంటే ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ అద్భుతంగా ఉంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం ఆకట్టుకుంటుంది. నాకు, సమంతకు పేరు రావడానికి కారణం దర్శకుడు గౌతం మీనన్, ఆయన వల్లే ఈచిత్రం విజయవంతం అయింది' అని చెప్పుకొచ్చాడు హీరో నాని.
సినిమా విజయవంతంగా ప్రదర్శితం అవుతున్న నేపథ్యంలో ఈ రోజు హైదరాబాద్ లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు గౌతం మీనన్, నాని, సమంత, నిర్మాత సి కళ్యాణ్, మాటల రచయిత కోన వెంకట్, కథా రచయిత రేష్మి, పాటల రచయిత అనంత శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.
దర్శకుడు గౌతం మీనన్ మాట్లాడుతూ 'రేష్మి ఇచ్చిన కథకుకు కోన వెంకట్ అద్భుతమైన మాటలు రాసారు. ఇళయరాజా మ్యూజిక్ నన్ను మరింత ప్రొత్సహించింది. నాని, సమంత పెర్ఫార్మెన్స్ సినిమాకు మరింత ప్లస్సయింది. నిర్మాత కళ్యాణ్ సినిమాను పెద్ద ఎత్తున రిలీజ్ చేసి సినిమా విజయానికి కారణం అయ్యారు' అని చెప్పుకొచ్చారు.
రచయిత కోన వెంకట్ మాట్లాడుతూ...సినిమా చూసిన వారంతా స్లోగా ఉందని అంటున్నారు. కానీ అది వాస్తవం కాదు. ప్రేక్షకుల మనసును హత్తుకునే చిత్రమని వెల్లడించారు. సమంత మాట్లాడుతూ...తనకు గౌతం దర్శకత్వంలో రెండో హిట్. నిత్యలాంటి పాత్ర మళ్లీ నాకు దొరకదు అని చెప్పుకొచ్చింది. గౌతం మీనన్ వల్ల ఇళయరాజాగా సంగీతానికి పాటలు రాయాలనే కోరిక తీరిందని పాటల రచయిత అనంత శ్రీరామ్ చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











