రామ్ చరణ్ ఎవడు ఆడియో విడుదల తేదీ ఖరారు!
ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఆడియో విడుదలై రెండు వారాల్లో (బహుషా జులై 24?) సినిమాను విడుదల చేసే అకవాశం ఉంది. . ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తుండగా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనున్నాడు అల్లు అర్జున్, రామ్ చరణ్ కాంబినేషన్ కావటంతో ఈ సినిమాకి మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. ఈ చిత్రంలో చెర్రీ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఆదిత్యా మ్యూజిక్ వారు ఈ రైట్స్ ని భారీ మొత్తం చెల్లించి సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.
యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో తొలుత సమంతను తీసుకున్నప్పటికీ ఆ తర్వాత ఆమెను మార్చి శృతి హాసన్ ను తీసుకున్నారు. బ్రిటిష్ మోడల్ అమీ జాక్స్ సెకండ్ హీరోయిన్ గా చేస్తోంది. మరో వైపు చెర్రీ నటిస్తున్న బాలీవుడ్ మూవీ 'జంజీర్'(తెలుగులో తుఫాన్) చిత్రం ఎవడు చిత్రం తర్వాత దాదాపు 50 రోజుల గ్యాప్‌తో విడుదలయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications












