రామ్ చరణ్ 'ఎవడు' ఆడియో విడుదల తేదీ ఖరారు

By Srikanya

హైదరాబాద్ : రామ్ చరణ్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం 'ఎవడు' . ఇప్పటికే చిత్ర వర్గాల్లో మంచి క్రేజ్ ని క్రియేట్ చేసిన ఈ చిత్రం ఆడియో జూన్ 1న విడుదల కానుందని విశ్వసనీయ సమాచారం. అలాగే చిత్రం జూన్ 28 న గ్రాండ్ గా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం అభిమానులను సైతం ఓ రేంజిలో అలరించే చిత్రం అవుతుందని అంటున్నారు. ఈ చిత్రం పూర్తి స్ధాయి యాక్షన్ తో ఎంటర్టైన్మెంట్ అండర్ కరంట్ గా సాగే చిత్రం అని చెప్తున్నారు.

ఈ చిత్రం కాన్సెప్టు ఏమిటంటే... మంచికీ చెడుకీ, న్యాయానికీ అన్యాయానికీ యుద్ధం ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. అధిపత్యం చేతులు మారినా... చివరికి విజయం మంచి వైపే ఉంటుంది. అయితే ధర్మం వైపు నిలబడి పోరాడేవాడు కావాలి. ఏ సమరమైనా ఒక్కడే మొదలుపెడతాడు. ఆ తరవాత సమూహం అతని వెంట నడుస్తుంది. మరి ఆ ఒక్కడు ఎవడు? ఎక్కడి నుంచి వచ్చాడు? ఈ విషయాలు తెలియాలంటే 'ఎవడు' చూడాల్సిందే. ..అంటున్నారు.

రామ్‌చరణ్‌ మాట్లాడుతూ... ''నాలుగు సన్నివేశాల తరవాత ఓ పాట, వెంటనే పోరాట సన్నివేశం.. ఈ తరహాలో సాగే చిత్రం కాదిది. సినిమా ఎత్తుగడే కొత్తగా అనిపిస్తుంది. పోరాట ఘట్టాలు కూడా విభిన్నంగా తీర్చిదిద్దారు. బన్నీ కనిపించేది కొద్దిసేపే అయినా.. ఆ పాత్రే కథను మలుపు తిప్పుతుంది'' అన్నారు.

'ఎవడు' లో రామ్ చరణ్ సరసన శ్రుతిహాసన్‌, అమీజాక్సన్‌ హీరోయిన్స్ . అల్లు అర్జున్‌, కాజల్‌ ప్రత్యేక పాత్రల్లో కనిపిస్తారు. దిల్‌ రాజు నిర్మాత. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో పీటర్‌హెయిన్స్‌ ఆధ్వర్యంలో ఫైట్ సీన్స్ తెరకెక్కిస్తున్నారు. సహనిర్మాతలు: శిరీష్‌, లక్ష్మణ్‌; సంగీతం: దేవిశ్రీప్రసాద్‌.

రీసెంట్ గా ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో రిలీజ్ డేట్ ఖరారైనట్లు వార్తలు అందుతున్నాయి. మే 9వ తేదీన ఆడియో విడుదల చేసేందుకు నిర్ణయించినట్లు సమాచారం. రామ్ చరణ్-ఉపాసన మొదటి పెళ్లి రోజైన జూన్ 14వ తేదీన 'ఎవడు' చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 'ఎవడు' చిత్రానికి చెర్రీ బాబాయ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X