»   » అయోమయం : ‘ఎవడు’ ఆడియో డేట్ వాయిదా!

అయోమయం : ‘ఎవడు’ ఆడియో డేట్ వాయిదా!

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : ఈ మధ్య సినిమా వాళ్లకు అస్సలు టైం సెన్స్ లేకుండా పోతోంది. ముందు వెనకా ఆలోచించకుండా ఏదో డేట్ ప్రకటించేయడం... ఆ తర్వాత ఏవో ఇబ్బందులు, రకరకాల కారణాలతో ఆ డేట్ మార్చేయడం సర్వసాధారణమైంది. సినిమా విడుదల విషయంలోనే కాదు, ఆడియో ఫంక్షన్ల విషయంలోనూ ఇదే తంతు కోనసాగుతోంది. ఇలాంటి చర్యల కారణంగా అభిమానులు అయోమయంలో పడుతున్నారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న 'ఎవడు' మూవీ ఆడియో జూన్ 30న ఆదివారం విడుదల చేయనున్నట్లు అఫీషియల్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఏవో ఇబ్బందులతో రిలీజ్ డేట్ ను జులై 1కి మార్చారు. ఈ మార్పుకు గల కారణాలు ఏమిటో తెలియడం లేదు.

మరో వైపు....'కెవ్వుకేక' ఆడియో మొదట అల్లరి నరేష్ పుట్టిన రోజు సందర్భంగా జూన్ 30న అనుకున్నారు. కానీ అదే రోజు 'ఎవడు' ఉండటంతో జులై 1కి వాయిదా వేసుకున్నారు. తాజాగా 'ఎవడు' కూడా జులై 1కి వాయిదా పడటంతో....'కెవ్వు కేక' ఆడియో ముందుగా అనుకున్న విధంగా జూన్ 30న నరేష్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసే అవకాశం ఉంది. అఫీషియల్ ప్రకటన వెలువడితే తప్ప...పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం కనిపించడం లేదు.

ఎవడు చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తుండగా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. జులై చివరి వారంలో 'ఎవడు' సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనున్నాడు.

అల్లు అర్జున్, రామ్ చరణ్ కాంబినేషన్ కావటంతో ఈ సినిమాకి మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. ఈ చిత్రంలో చెర్రీ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఆదిత్యా మ్యూజిక్ వారు ఈ రైట్స్ ని భారీ మొత్తం చెల్లించి సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్. బ్రిటిష్ మోడల్ అమీ జాక్స్ సెకండ్ హీరోయిన్ గా చేస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

English summary
Ram Charan’s ‘Yevadu’ audio release postponed to July 1st. Vamsi Paidipally is the director of the film and Dil Raju is the producer. The film is gearing up for a possible release in the last week of July.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu