‘ఎవడు’ ఆడియో జూన్ 30న (అఫీషియల్)
హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న 'ఎవడు' చిత్రం ఆడియో రిలీజ్ డేట్ అఫీషియల్‌గా ఖరారైంది. జూన్ 30వ తేదీ ఆడియో వేడుక జరుపనున్నట్లు రామ్ చరణ్ పిఆర్ఓ వెల్లడించారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తుండగా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. జులై చివరి వారంలో 'ఎవడు' సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనున్నాడు.
అల్లు అర్జున్, రామ్ చరణ్ కాంబినేషన్ కావటంతో ఈ సినిమాకి మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. ఈ చిత్రంలో చెర్రీ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఆదిత్యా మ్యూజిక్ వారు ఈ రైట్స్ ని భారీ మొత్తం చెల్లించి సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్. బ్రిటిష్ మోడల్ అమీ జాక్స్ సెకండ్ హీరోయిన్ గా చేస్తోంది.
ఆ మధ్య ఈ చిత్రానికి సంబంధించిన ఫుల్ సాంగ్ లీకైన సంగతి మరువక ముందే...తాజాగా మరో సాంగ్ లీకైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 'చెలియా చెలియా' అంటూ సాగే ఆడియో ట్రాక్ ఇప్పుడు ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. షూటింగ్ లొకేషన్లో ఈ సాంగు రికార్డ్ చేసి లీక్ చేసినట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన టీజర్ మ్యూజిక్, ఈ సాంగు మ్యూజిక్ దాదాపుగా ఒకేలా ఉన్నాయి.


Click it and Unblock the Notifications











