'ఎవడు' విశేషాలతో యాప్ విడుదల
హైదరాబాద్ : రామ్‌చరణ్ తాజా చిత్రం 'ఎవడు'. సంక్రాంతికి విడుదల కానున్న ఈ సినిమాకి సంబంధించిన మొబైల్ అధికారిక అప్లికేషన్ (యాప్) నేటి నుంచి ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. చిత్ర హీరోయిన్ శ్రుతిహాసన్ చేతుల మీదుగా ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో ఈ యాప్‌ని విడుదల చేశారు. అనంతరం ఆమె మాట్లాడారు.
శృతి హాసన్ మాట్లాడుతూ ''ఎవడు' నాకెంతో ప్రత్యేకం. ప్రేక్షకుల్లాగే నేను కూడా సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అనిపిస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన మొత్తం సమాచారాన్ని చిత్రబృందం ఈ యాప్ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చింది'' అన్నారు.

దిల్ రాజు మాట్లాడుతూ.... ''ఈ సినిమాను ఇటీవల చిరంజీవిగారు చూసి ఎంతో ఆనందించారు. ప్రేక్షకులకు కూడా అదే స్థాయిలో నచ్చుతుందని ఆశిస్తున్నాను'' అన్నారు నిర్మాత దిల్‌రాజు. ఈ కార్యక్రమంలో దర్శకుడు వంశీ పైడిపల్లి, బిగ్ సి ప్రతినిధి పవన్ తదితరులు పాల్గొన్నారు.
శ్రుతిహాసన్, అమీ జాక్సన్ హీరోయిన్స్ గా చేసిన ఈ చిత్రానికి వంశీపైడిపల్లి దర్శకత్వం వహించారు. దిల్ రాజు నిర్మాత. ''బతికితే ఆశలు... పోతే ప్రాణాలు అనుకునే తత్వం ఉన్న యువకుడి కథ ఇది. రామ్‌చరణ్ ...నాయకుడి పాత్రలో మరోసారి ప్రేక్షకుల్ని అలరించనున్నాడు. అల్లు అర్జున్, కాజల్ ప్రత్యేక పాత్రలు సినిమాకి అదనపు ఆకర్షణ. దేవిశ్రీప్రసాద్ అందించిన పాటలకు మంచి స్పందన వచ్చింది'' అన్నారు నిర్మాత. కూర్పు: మార్తాండ్ కె.వెంకటేష్, కళ: ఆనంద్‌సాయి, సహనిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్. నూతన సంవత్సరం సందర్భంగా బీజియంతో కూడిన కొత్త టీజర్‌ని మంగళవారం ఆన్‌లైన్‌లో విడుదల చేశారు.


Click it and Unblock the Notifications











