షాక్ : మరో సాంగు లీక్ చేసింది ‘ఎవడు’!
హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న 'ఎవడు' చిత్రానికి మళ్లీ పెద్ద షాక్ తగిలింది. ఆ మధ్య ఈ చిత్రానికి సంబంధించిన ఫుల్ సాంగ్ లీకైన సంగతి మరువక ముందే...తాజాగా మరో సాంగ్ లీకైంది. 'చెలియా చెలియా' అంటూ సాగే ఆడియో ట్రాక్ ఇప్పుడు ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది.
షూటింగ్ లొకేషన్లో ఈ సాంగు రికార్డ్ చేసి లీక్ చేసినట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన టీజర్ మ్యూజిక్, ఈ సాంగు మ్యూజిక్ దాదాపుగా ఒకేలా ఉన్నాయి. రామ్ చరణ్ తేజ్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో ప్రతిష్టాత్మకంగా 'ఎవడు' చిత్రం రూపొందుతోంది.
ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్. బ్రిటిష్ మోడల్ అమీ జాక్స్ సెకండ్ హీరోయిన్ గా చేస్తోంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనున్నాడు. ఈచిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు.
దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అల్లు అర్జున్, రామ్ చరణ్ కాంబినేషన్ కావటంతో ఈ సినిమాకి మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం జులై 7న ఆడియో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఆడియో విడుదలై రెండు వారాల్లో (బహుషా జులై 24?) సినిమాను విడుదల చేసే అకవాశం ఉంది.


Click it and Unblock the Notifications











