రామ్ చరణ్ ‘ఎవడు’ ఆడియో రైట్స్ ఎవరికంటే...
హైదరాబాద్: రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'ఎవడు' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఇప్పటికే విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఆడియో రైట్స్ అదిరిపోయే రేటుకు అమ్ముడయ్యాయని సమాచారం. ఆదిత్యా మ్యూజిక్ వారు ఈ రైట్స్ ని భారీ మొత్తం చెల్లించి సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే... ఎన్టీఆర్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో దిల్ రాజు నిర్మించే చిత్రం ఆడియో రైట్స్ ని సైతం ఆదిత్యా వారే తీసుకున్నారు.
ఇక ఇప్పటికే దాదాపు 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న 'ఎవడు' చిత్రం వేసవిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో తొలుత సమంతను తీసుకున్నప్పటికీ ఆ తర్వాత ఆమెను మార్చి శృతి హాసన్ ను తీసుకున్నారు. బ్రిటిష్ మోడల్ అమీ జాక్స్ సెకండ్ హీరోయిన్ గా చేస్తోంది. అల్లు అర్జున్ ఈ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనున్నాడు. ఈచిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు.
దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అల్లు అర్జున్, రామ్ చరణ్ కాంబినేషన్ కావటంతో ఈ సినిమాకి మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. రామ్ చరణ్ నటించిన 'నాయక్' చిత్రం సంక్రాంతికి విడుదలై భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 'ఎవడు' చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
రీసెంట్ గా ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో రిలీజ్ డేట్ ఖరారైనట్లు వార్తలు అందుతున్నాయి. మే 9వ తేదీన ఆడియో విడుదల చేసేందుకు నిర్ణయించినట్లు సమాచారం. రామ్ చరణ్-ఉపాసన మొదటి పెళ్లి రోజైన జూన్ 14వ తేదీన 'ఎవడు' చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 'ఎవడు' చిత్రానికి చెర్రీ బాబాయ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నారు.


Click it and Unblock the Notifications











