ఫ్యాన్స్‌కి రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్టు ఏమిటో తెలుసా?

By Bojja Kumar

హైదరాబాద్: మార్చి 27... రామ్ చరణ్ అభిమానులకు పండగ రోజు. ఎందుకంటే ఆ రోజు చెర్రీ పుట్టినరోజు. సినీ స్టార్స్ నుంచి అభిమానులు కోరుకునేది సినిమాలకు మించి మరేముంటుంది. ఈ సారి రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులకు అందబోయే కానుక 'ఎవడు' సినిమా ఫస్ట్ లుక్ టీజర్. అయితే ఈ విషయం అఫీషియల్ గా ఖరారు కావాల్సి ఉంది.

ఇప్పటికే దాదాపు 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న 'ఎవడు' చిత్రం వేసవిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈచిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో తొలుత సమంతను తీసుకున్నప్పటికీ ఆ తర్వాత ఆమెను మార్చి శృతి హాసన్ ను తీసుకున్నారు. బ్రిటిష్ మోడల్ అమీ జాక్స్ సెకండ్ హీరోయిన్ గా చేస్తోంది.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనున్నాడు. ఈచిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అల్లు అర్జున్, రామ్ చరణ్ కాంబినేషన్ కావటంతో ఈ సినిమాకి మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు.

రామ్ చరణ్ నటించిన 'నాయక్' చిత్రం సంక్రాంతికి విడుదలై భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 'ఎవడు' చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గదని అంటున్నారు దర్శకుడు వంశీ పైడిపల్లి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X