రామ్ చరణ్ ‘ఎవడు’కి షాక్!
హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న 'ఎవడు' చిత్రానికి పెద్ద షాక్ తగిలింది. ఇటీవల రామ్ చరణ్ నాయక్ చిత్రంలోని 'లైలా ఓ లైలా' ఫుల్ సాంగ్ ఇంటర్నెట్ లో లీకైన సంఘటన మరువక ముందే... తాజాగా ఆయన నటిస్తున్న 'ఎవడు' చిత్రంలోని వీడియో సాంగు కూడా ఫుల్లుగా నెట్లో లీకై పోయింది. దీంతో చిత్ర యూనిట్ సభ్యులు ఈ సాంగు ఎలా లీకైందనే విషయమై ఆరా తీస్తున్నారు. లీక్ విషయం వివాదాస్పదం కావడంతో ప్రస్తుతం దాన్ని ఇంటర్నెట్ నుంచి తొలగించారు.
రామ్ చరణ్ తేజ్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో ప్రతిష్టాత్మకంగా 'ఎవడు' చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో తొలుత సమంతను తీసుకున్నప్పటికీ ఆ తర్వాత ఆమెను మార్చి శృతి హాసన్ ను తీసుకున్నారు. బ్రిటిష్ మోడల్ అమీ జాక్స్ సెకండ్ హీరోయిన్ గా చేస్తోంది.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనున్నాడు. ఈచిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అల్లు అర్జున్, రామ్ చరణ్ కాంబినేషన్ కావటంతో ఈ సినిమాకి మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. రామ్ చరణ్ 'ఎవడు' చిత్రంతో పాటు ప్యారలాల్ గా వివి వినాయక్ దర్శకత్వంలో 'నాయక్' చిత్రంతో పాటు....... తొలి బాలీవుడ్ చిత్రం 'జంజీర్' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











