‘ఎవడు’ సెన్సార్ రిపోర్ట్ - ప్చ్..అంటున్న ఫ్యామిలీస్
హైదరాబాద్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న 'ఎవడు' చిత్రం ఈ నెల 12న గ్రాండ్‌గా విడుదలకు సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం సెన్సార్ సర్టిఫికెట్ ఫ్యామిలీ ప్రేక్షకులను నిరాశ పరుస్తోంది. ఫ్యామిలీ ప్రేక్షకులు షాకయ్యే విధంగా ఈచిత్రానికి సెన్సార్ బోర్డ్ సభ్యులు 'A' సర్టిఫికెట్ జారీ చేసారు. పెద్దలు మాత్రమే చూడదగిన సినిమాకు మాత్రమే 'A' సర్టిఫికెట్ జారీ చేస్తారు.
సంక్రాంతి పండగ పూట......పిల్లలతో కలిసి సినిమాకు వెళ్లాలనుకునే వారు ఈ చిత్రానికి వచ్చిన సెన్సార్ రేటింగ్ చూసి నిరాశ పడుతున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఎవడు సినిమా తెరకెక్కింది. శృతి హాసన్, ఎమీ జాక్సన్ హీరోయిన్లు. దిల్ రాజు నిర్మాత. ఈచిత్రంపై మెగా ఫ్యామిలీ పూర్తి నమ్మకంతో ఉంది. గతంలో జరిగిన ఆడియో వేడుకలో చిరంజీవి ఈ సినిమా గురించి మాట్లాడుతూ సినిమా మగధీరను మించిన హిట్టవుతుందని స్పష్టం చేసారు.

నిర్మాత దిల్ రాజు సినిమా గురించి మాట్లాడుతూ...సినిమా తమ బేనర్లో బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ అవుతుందనే ఆశాభావం వెలుబుచ్చారు. ఇప్పటికే అనేక కమర్షియల్ హిట్స్ ఇచ్చిన రామ్ చరణ్ ఎవడు చిత్రంతో మరో విజయం సొంతం చేసుకుంటారు' అనే నమ్మకం వ్యక్తం చేసారు.
'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్ ప్రత్యేక పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే. వారి పాత్రలు సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి. జయసుధ, సాయికుమార్, కోట శ్రీనివాసరావు, రాహుల్‌దేవ్, అజయ్, ఎల్బీ శ్రీరామ్, సుప్రీత్, వెన్నెల కిషోర్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి మాటలు: అబ్బూరి రవి, కూర్పు: మార్తాండ్ కె.వెంకటేష్, కళ: ఆనంద్ సాయి, సహ నిర్మాతలు: శిరీష్ - లక్ష్మణ్, నిర్మాత : దిల్ రాజు, దర్శకత్వం : వంశీ పైడిపల్లి.


Click it and Unblock the Notifications











