రామ్ చరణ్ ‘ఎవడు’ ఆడియో రిలీజ్ డేట్ ఖరారు
హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న 'ఎవడు' చిత్రం షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో పలు కీలక సీన్లు చిత్రీకరిస్తున్నారు. వేసవి చివరలో విడుదల చేయడమే లక్ష్యంగా త్వరిత గతిన సినిమా షూటింగ్ పనులు పూర్తి చేస్తున్నారు.
తాజాగా ఈచిత్రానికి సంబంధించిన ఆడియో రిలీజ్ డేట్ ఖరారైనట్లు వార్తలు అందుతున్నాయి. మే 9వ తేదీన ఆడియో విడుదల చేసేందుకు నిర్ణయించినట్లు సమాచారం. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఆడి విడుదలైన నెలరోజుల్లోగా అంటే జూన్ నెలలో సినిమాను విడుదల చేసే ప్లాన్లో ఉన్నారు నిర్మాతలు.
ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తుండగా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామ్ చరణ్ పుట్టిన రోజునుమార్చి 27) పురస్కరించుకుని 'ఎవడు' సినిమా ఫస్ట్ లుక్ టీజర్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనున్నాడు అల్లు అర్జున్, రామ్ చరణ్ కాంబినేషన్ కావటంతో ఈ సినిమాకి మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. ఈ చిత్రంలో చెర్రీ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. మరో వైపు చెర్రీ నటిస్తున్న బాలీవుడ్ మూవీ 'జంజీర్'(తెలుగులో తుఫాన్) చిత్రం ఎవడు చిత్రం తర్వాత దాదాపు 50 రోజుల గ్యాప్‌తో విడుదలయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











