రామ్ చరణ్ ‘ఎవడు’ సంగతేంటి?
హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న 'నాయక్' చిత్రం మూలంగా చెర్రీ నటిస్తున్న మరో సినిమా 'ఎవడు' షూటింగుకు బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా నాయక్ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ సంక్రాంతికి విడుదలకు సిద్ధం అవుతోంది.
ఈ నేపథ్యంలో 'ఎవడు' చిత్రం తర్వాతి షెడ్యూల్ సంక్రాంతి తర్వాత ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎవడు చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తుండగా, ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామ్ చరణ్ సరసన శృతి హాసన్, అమీ జాక్సన్ హీరోయిన్లుగా చేస్తున్నారు.
ఈ చిత్రానికి సంబంధించిన మరో ఆసక్తి కర విషయం ఏమిటంటే.... స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్ ఇందులో ప్రత్యేక పాత్రల్లో దర్శనం ఇవ్వబోతున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండటం ఈ చిత్రానికి ఉన్న మరో ప్లస్ పాయింట్. దర్శకుడు వంశీ పైడిపల్లి ఈచిత్రాన్ని స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా రూపొందిస్తున్నారు.
గతంలో ఈచిత్రంలో ఈ చిత్రంలో శృతి హాసన్‌కు బదులు సమంత హీరోయిన్‌గా ఎంపికైంది. అయితే కొన్ని కారణాల వల్ల ఆమెను తొలగించి శృతిని ఎంపిక చేసారు. దర్శకుడు చిత్రం గురించి మాట్లాడుతూ.. ''రామ్ చరణ్‌ని ఓ విభిన్నశైలిలో ఆవిష్కరించే చిత్రమిది. మాస్ అంశాలు పుష్కలంగా ఉంటాయి. ఈ కథలో ప్రతి పాత్ర కీలకమే. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అలరిస్తాయని''అన్నారు. ఐటం సాంగ్ ల స్పెషలిస్ట్ అయిన దేవి ఈ చిత్రం కోసం కెవ్వు కేక పాటను మించేలా ఐటం సాంగ్ ని స్వరపరిచారని చెప్పుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











