‘ఎవడు’ రిలీజ్ డేట్ స్పెషల్ ఏమిటంటే..
హైదరాబాద్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'ఎవడు' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలసిందే. ఈ చిత్రంలో సమంతను లీడ్ హీరోయిన్ గా చేస్తోంది. సమంతతో పాటు సెకండ్ హీరోయిన్‌గా బ్రిటిష్ మోడల్ అమీ జాక్సన్‌ను కూడా ఎంపిక చేశారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనున్నాడు.
తాజాగా అందిన సమాచారం ప్రకరాం 'ఎవడు' చిత్రాన్ని ఏప్రిల్ 4, 2013న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ రోజుకు ఓ ప్రత్యేకత ఉంది. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న దిల్ రాజు ఆ రోజుతో నిర్మాతగా 10 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నాడు. దిల్ చిత్రం ద్వారా నిర్మాతగా ఎంట్రీ ఇచ్చిన నిర్మాత వి. వెంకట రమణారెడ్డి ఆ చిత్రం భారీ విజయం సాధించడంతో 'దిల్'రాజుగా మారిపోయాడు. సెంటిమెంటుగా అదే రోజు 'ఎవడు' చిత్రాన్ని రిలీజ్ చేసి హిట్ కొట్టాలని చూస్తున్నాడు దిల్ రాజు.
మరో వైపు ఈచిత్రం స్టోరీ లీకైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ వివరాల ప్రకారం........''ఎవడు సినిమా అల్లు అర్జున్ తో మొదలవుతుంది. అల్లు అర్జున్ హ్యాపీగా కాలం గడిపే కుర్రాడు. ఇంతలో ఒకమ్మాయితో ప్రేమలో పడతాడు. ఇలా ఆనందంగా కాలం గడిచిపోతుండగా ఒక భయంకరమైన యాక్సిడెంట్ లో అతని ముఖం చిద్రం అవుతుంది.
డాక్టర్లు ప్లాస్టిక్ సర్జరీ చేయడానికి రెడీ అవుతారు. అతని రియల్ ఫేస్ ఇదే అంటూ అల్లు అర్జున తల్లి సుహాసిని రామ్ చరణ్ ఫోటో డాక్టర్లకు ఇస్తుంది. దీంతో అల్లు అర్జున్ కి చరణ్ ముఖాన్ని అతికిస్తారు డాక్టర్లు. ఇంటర్వెల్ తరువాత అసలు ప్రోబ్లమ్స్ మొదలవుతాయి. తను ప్రేమించిన ప్రేయసి రామ్ చరణ్ మొహం చూసి దూరం అవుతుంది.
అసలు రామ్ చరణ్ ప్రేయసి అతని మొహంతో ఉన్న అల్లు అర్జున్ వెంట పడుతుంది. అల్లు అర్జున్ రామ్ చరణ్ తేజ అనుకుని కొంతమంది చంపడానికి ప్రయత్నిస్తూ వుంటారు. ఈ పరిణామాల నేపథ్యంలో రామ్ చరణ్ రూపంతో ఉన్న అల్లు అర్జున్ ఏం చేసాడు? అనేది మిగతా కథ''
అయితే ఈ స్టోరీ లీకేజీపై దర్శకుడు వంశీ పైడిపల్లి స్పందిస్తూ అదంతా అవాస్తవమని, అది అసలు స్టోరీ కానది అంటున్నారు. అయితే ఫిల్మ్ నగర్ జనాలు మాత్రం కవర్ చేసుకోవడానికే వంశీ పైడిపల్లి అలా చెబుతున్నాడని అంటున్నారు. మరి ఏది నిజమో సినిమా విడుదలైతేగానీ చెప్పలేం. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











