ఎవడు : రొమాంటిక్ సీన్లు అదిరాయ్ (ఫోటోలు)
హైదరాబాద్ : మోగా పవర్ స్టార్ రామ్ చరణ్ త్వరలో 'ఎవడు' చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం హీరో హీరోయిన్ల మధ్య జరిగే రొమాంటిక్ సీన్లకు సంబంధించిన వాల్ పేపర్స్ విడుదలయ్యాయి. ఇందులో చెర్రీ లుక్ తో పాటు, హీరోయిన్లతో చేస్తున్న రొమాంటిక్ పిక్స్ సూపర్‌గా, సినిమాపై అంచనాలు పెంచే విధంగా ఉంది. అదే విధంగా చెర్రీకి తగిన జోడీగా శృతి హాసన్, అమీ జాక్సన్ ఆకట్టుకుంటున్నారు.
ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన పాట చిత్రీకరణ హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. ఇక్కడ రామ్ చరణ్, శృతి హాసన్‌పై మాస్ సాంగ్ చిత్రీకరించారు. ఈ పాట చిత్రీకరణ ప్రముఖ కొరియెగ్రాఫర్ శేఖర్ సమక్షంలో జరుగింది. మాస్‌ను ఆకట్టుకునే 'ఎవడు' సినిమా తెరకెక్కుతోంది.
'ఎవడు' చిత్రం ఆడియో రిలీజ్ వేడుకను జులై 1న హైదరాబాద్ కన్వెన్షన్ సెంటర్-నోవాటెల్‌లో జరుగనుంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. జులై చివరి వారంలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తుండగా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనున్నాడు. అల్లు అర్జున్, రామ్ చరణ్ కాంబినేషన్ కావటంతో ఈ సినిమాకి మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు.

ఈ చిత్రంలో చెర్రీ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. బ్రిటిష్ మోడల్ అమీ జాక్స్ సెకండ్ హీరోయిన్ గా చేస్తోంది.

జులై 1న కన్వెన్షన్ సెంటర్-నోవాటెల్ లో అదరిపోయే రేంజిలో ఆడియో వేడుక నిర్వహించనున్నారు.


Click it and Unblock the Notifications











