వైజాగ్ లో రామ్ చరణ్ చిత్రం నెక్ట్స్ షెడ్యూల్

By Srikanya

హైదరాబాద్ : రామ్ చరణ్ తేజ,వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'ఎవడు'. ఈ చిత్రం తాజా షెడ్యూల్ సెప్టెంబర్ 14 న మొదలుకానుంది. విశాఖపట్టడంలో ఈ షెడ్యూల్ ని పూర్తిగా ప్లాన్ చేసారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. అమీ జాక్సన్ మీద సీన్స్ షూట్ చేస్తున్నారు. యాక్షన్ ధ్రిల్లర్ గా చెప్పబడుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు.

ఇక ఈ చిత్రంలో సమంతను లీడ్ హీరోయిన్ గా చేస్తోంది. సమంతతో పాటు సెకండ్ హీరోయిన్‌గా బ్రిటిష్ మోడల్ అమీ జాక్సన్‌ను కూడా ఎంపిక చేశారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనున్నాడు. అల్లు అర్జున్ సరసన కాజల్ గెస్ట్ గా రీసెంట్ గా ఎంపిక చేసారు. ఈ విషయమై దిల్ రాజు మాట్లాడుతూ..అవును..కాజల్ మా ఎవడు చిత్రంలో గెస్ట్ పాత్ర చేస్తోంది. ఆమె అల్లు అర్జున్ పాత్రకు పెయిర్ గా కనిపించనుంది.

అలాగే ఈ చిత్రం ఏప్రియల్ 5,2013 న విడుదల చేయటానికి చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఆ రోజునే ఎంపిక చేయటానికి కారణం దిల్ రాజు ప్రారంభ రోజుల్లో నిర్మించిన దిల్ విడుదలైన రోజు అది. నితిన్ హీరోగా చేసిన ఆ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. దాంతో సెంటిమెంట్ గా ఆ రోజు అయితే బావుంటుందని నిర్ణంయించినట్లు సమాచారం.

రామ్ చరణ్ తేజ్ కొన్ని వారాలుగా చెర్రీ బాలీవుడ్ మూవీ జంజీర్ రీమేక్, వివి వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగుల్లో పాల్గొంటూ వస్తున్నాడు. అల్లు అర్జున్,రామ్ చరణ్ కాంబినేషన్ కావటంతో ఈ సినిమాకి మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈచిత్రానికి సంగీతం సమకూర్చుతున్నారు. ఈ చిత్రం రామ్ చరణ్ కి ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చిపెట్టి మార్కెట్ రేంజి పెంచుతుందని దర్శకుడు చెప్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X