నెల్లూరులో రామ్ చరణ్ ‘ఎవడు’ ఆల్ టైమ్ రికార్డ్
నెల్లూరు: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, వంశీ పైడిపల్లి కాంబినేషన్లో రాబోతున్న 'ఎవడు' చిత్రం నెల్లూరులో ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పింది. నెల్లూరు సినీ ట్రేడ్ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం ఈచిత్రం నెల్లూరు చరిత్రలోనే భారీ రేటుకు అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది.
లీలా మోహన్ రెడ్డి 'ఎవడు' చిత్రం రైట్స్ రికార్డు స్థాయిలో రూ. 1.95 కోట్లు చెల్లించి సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల 'నాయక్' చిత్రం నెల్లూరు రైట్స్ రూ. 1.89 కోట్లకు అమ్మడు పోగా.... తాజాగా ఎవడుతో రామ్ చరణ్ తన రికార్డు తానే బద్దలు కొట్టుకున్నట్లయింది.
ఈ చిత్రంలో సమంతను లీడ్ హీరోయిన్ గా చేస్తోంది. సమంతతో పాటు సెకండ్ హీరోయిన్‌గా బ్రిటిష్ మోడల్ అమీ జాక్సన్‌ను కూడా ఎంపిక చేశారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనున్నాడు. ఈచిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
అల్లు అర్జున్, రామ్ చరణ్ కాంబినేషన్ కావటంతో ఈ సినిమాకి మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. ఈ చిత్రం తాజా షెడ్యూల్ సెప్టెంబర్ 14న వైజాగ్ లో మొదలయింది. మరో వైపు రామ్ చరణ్ 'ఎవడు' చిత్రంతో పాటు ప్యారలాల్ గా వివి వినాయక్ దర్శకత్వంలో 'నాయక్' చిత్రంతో పాటు....... తొలి బాలీవుడ్ చిత్రం 'జంజీర్' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











